తెలంగాణ

రైతులకు చేసిందేమిటో చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: మూడేళ్ల పాలనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఎటువంటి మేలు చేసిందో చెప్పాలని కాంగ్రెస్ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో గురువారం వారు విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్టల్రో రైతులు సమస్యలలో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఆదుకోవలసింది పోయి ప్రజాధనాన్ని ప్లీనరీలు, బహిరంగ సభల పేరుతో వృథా చేస్తుందని ఆరోపించారు. ఉద్యమాలు చేసిన వారిని గాలికి వదిలేసి బంగారు తెలంగాణ బ్యాచ్ రాజ్యమేలుతోందని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో ఎన్ని అమలవుతున్నాయో శే్వత పత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో కేవలం ముఖ్యమంత్రి కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని, ఉద్యమంలో దెబ్బలు తిన్న టిఆర్‌ఎస్ కార్యకర్తలంతా ఇప్పుడు నిలదీయాలని వారు డిమాండ్ చేశారు. ఓయూలో విద్యార్థులు తిరుబాటుతో టిఆర్‌ఎస్ పతనం మొదలైందన్నారు.