తెలంగాణ

బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లన్నీ బూటకమేనని, కేంద్రప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లను వెంటనే ఆపేయాలని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి వికల్ప్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాకు ఒక వాయిస్ ప్రకటన విడుదల చేశారు. దండకారణ్యంలో పోలీసులు మారణ హోమం సృష్టిస్తున్నారని, ప్రజల కోసం పోరాడే క్రాంతికార్ ఆందోళనకారులను హతమారుస్తున్నారని ఆయన ఆరోపించారు. పీడిత ప్రజల కోసం, ఆదివాసీ, గిరిజనుల కోసం మావోయిస్టులు సాగిస్తున్న పోరాటం ఆగదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అమాయక గిరిజనులు, ఆదివాసీలను హత్య చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న అరాచక హత్యలను మేధావులు, కళాకారులు, రచయితలు ఖండించాలని వికల్ప్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, ప్రజాయుద్దంలో అమరులైన మావోయిస్టుల మృతదేహాలను సైతం అప్పగించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ఎర్ర కార్పెట్లు వేస్తూ, దళిత, గిరిజన, ఆదివాసీల ఉపాధిపై దెబ్బ తీస్తున్నారని ఆయన విమర్శించారు. దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టుపెడుతున్న బిజెపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వికల్ప్ హెచ్చరించారు. సుక్మా దాడిలో అమరులైన మావోయిస్టు నేతల మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రేహౌండ్స్‌ను ఉపసంహరించుకోవాలని వికల్ప్ డిమాండ్ చేశారు.