తెలంగాణ

దేశ రాజకీయాల్లో ఓయు విద్యార్థులే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: దేశ రాజకీయలో ఓయూ విద్యార్థులే కీలక పాత్ర పోషిస్తున్నారని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, తమిళనాడు మానవ హక్కుల కమిషన్ చైర్మన్, న్యాయముర్తి మీనాకుమారి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఓయూకు దేశానికి రాజకీయ నాయకులను అందించన ఘనత దక్కుతుందని తెలిపారు.
ఓయూలో చదివిన ప్రతి విద్యార్థి అత్యున్నత స్థాయిలో ఉన్నారని, తాను మహారాష్ట్ర గవర్నర్ కావడం ఓయూ పెట్టిన భిక్షేనని చెప్పారు. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ వందేమాతరం ఉద్యమం నుండి నేటి తెలంగాణ ఉద్యమం వరకు ఓయూ విద్యార్థుల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాలకు ఓయూలో నిర్బంధాన్ని తలపించేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం బాధ కలిగించేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూలో చదివిన ప్రతి విద్యార్థి సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధించి ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శంగా నిలుస్తోందని ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ అన్నారు. ఓయూలో శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఐఐసిటి చైర్మన్ చంద్రశేఖర్ అధ్యక్షతన వహించారు. కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఇస్రో పరిశోధన రంగాల్లో ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. ప్రపంచ దేశాలు ఇస్రోను అనుసరిస్తు అనేక పరిశోధనలు చేస్తున్నాయని తెలిపారు. దేశంలోనే ఇస్రో అగ్రగామిగా నిలుస్తూ ప్రజల మన్ననలను పొందుతుందని తెలిపారు. పరిశోధనల ఫలితలు ప్రజలకు అందజేయడంలోనే నిజమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇస్రో నుంచి ఉపగ్రహాలను ప్రయోగించి సహజ సంపదలను గుర్తించడంలో విజయం సాధించామని పేర్కొన్నారు. ఇస్రో సాంకేతిక పరిజ్ఞానంతో జలవనరులు నిక్షేపాలను పరిశోధనలు చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఓయూ వైస్ ఛాన్సలార్ ఎస్.రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ఒఎస్‌డి లింబాద్రి, స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.