తెలంగాణ

అక్షరాలు రాని వారు ప్రొఫెసర్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఉన్నత విద్యారంగం నాశిరకంగా తయారవుతోందని, దానికి కారణం ప్రమాణాలు కొరవడటమేనని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్ కుమార్ సారస్వత్ పేర్కొన్నారు. ఇదో వేలం వెర్రిలా తయారైందని , యూనివర్శిటీల్లో ఉద్యోగానికి వచ్చిన వారు కనీసం ఆ దరఖాస్తు రాయడం కూడా రావడం లేదని, నాశిరకం పిహెచ్‌డిలతో ఉద్యోగాలకు రావడం వల్ల విద్యార్ధులు కూడా అదే రకంగా తయారవుతున్నారని అన్నారు. రెండు రోజుల పాటు జరిగే వైస్ ఛాన్సలర్ల జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు దిగజారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విస్తరణ చేసుకోవాలి కాని ఎంత మూల్యానికి అని ప్రశ్నించారు. గత 20 ఏళ్లుగా ఈ దిగజారుడు పెరిగిందని, ఈ సంస్థలను మళ్లీ నిలబెట్టేందుకు అందరూ ప్రయత్నించాలని చెప్పారు. బోధన పదవులకు ఇంటర్వ్యూలకు వచ్చే వారిలో సత్తా ఉండటం లేదని, దీనికి కారణాలు అనే్వషించి పరిష్కారాలను కనుగొనడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఒకపుడు విశ్వవిద్యాలయాలు ఎలాంటి నియంత్రణలు లేకుండానే పనిచేశాయని, అపుడు కూడా బాగా పనిచేశాయని, ఇన్ని నియంత్రణలు తెచ్చిన తర్వాత కూడా పనిచేయకపోవడానికి కారణాలు ఏమిటని అన్నారు. వినూత్న ఆలోచనలు లేకపోవడం, ఆ దిశగా పనిచేయకపోవడమే కారణమని చెప్పారు. ప్రమాణాలు దిగజారుతుంటే దానికి కారణాలు ఏమిటో అని మిగిలిన దేశాల్లో అనే్వషిస్తుంటారని, మనం కూడా అలా చేయాల్సి ఉందని చెప్పారు. విద్య, చుట్టూ ఉన్న వాతావరణం అనుకూలంగా ఉన్నపుడే వినూత్న ప్రయోగాలు విజయం సాధిస్తాయని చెప్పారు. ప్రాధమిక విద్య గాడి తప్పడంతో ఉన్నత విద్య కూడా గాడి తప్పిందని అన్నారు. నిధులు, సంస్కరణలు, నిపుణులు దొరికినపుడు సంస్థలు బాగుపడతాయని చెప్పారు. స్వతంత్రత కావాలని పదే పదే కోరుతుంటారని, జవాబుదారీతనం లేని స్వతంత్రతో ఏం లాభమని ఆయన ప్రశ్నించారు.