తెలంగాణ

ఆధునికతను అందిపుచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఆధునికతను సంతరించుకుంటూనే విద్యాసంస్థలు విలువలు, సంస్కృతిని మేళవించుకుంటూ ఎదగాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల జాతీయ సమ్మేళనాన్ని ఆయన గురువారం సాయంత్రం యూనివర్శిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో ప్రారంభించారు. ఉన్నత విద్యకు సమున్నతను తీసుకువచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని, గతంలో నలందా, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలతో అలరారిన దేశంలో నేడు విశ్వవిద్యాలయాలు అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. సిబ్బంది, విద్యార్థులు అంతా ముందుకు వచ్చి విశ్వవిద్యాలయాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. అద్భుతమైన ఆర్ట్స్ కాలేజీ భవనం, దాని శిల్పకళ అబ్బురపరిచిందని అన్నారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకోవడం ముదావహమని అన్నారు.
ఒక విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం గొప్ప అద్భుత కృత్యమేనని అన్నారు. అనేక మంది హేమాహేమీలు ఈ వర్శిటీ విద్యార్థులే కావడం గమనార్హమని అన్నారు. విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి మాట్లాడుతూ ఎంహెచ్‌ఆర్‌డి పంజాబ్ యూనివర్శిటీకి ఇస్తున్నట్టు కనీసం 50 శాతం నిధులను అన్ని వర్శిటీలకు ఇవ్వాలని సూచించారు. నలందా విశ్వవిద్యాలయంలో 10వేల మంది విద్యార్థులుంటే రెండు వేల మంది టీచర్లు ఉండేవారని అన్నారు. మరిన్ని విశ్వవిద్యాలయాలు నెలకొల్పాల్సిన అవసరం ఉందని చెప్పారు.దేశంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సదస్సు చర్చాగోష్టి గురువారం ఉదయమే ఐఐటిసి ప్రాంగణంలో మొదలైంది. ఈ చర్చాగోష్టి రెండు రోజుల పాటు జరుగుతుంది. అనంతరం చర్చలో వ్యక్తమైన అభిప్రాయాలతో ఒక నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారు. చర్చను ఉస్మానియా యూనివర్శిటీ మాజీ విసి ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ లాంఛనంగా ప్రారంభించగా, రెండో సెషన్‌కు ప్రస్తుత విసి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం హాజరయ్యారు. దేశంలో నేడు 777 విశ్వవిద్యాలయాలున్నాయని అవి అనేక సమస్యలతో సతమతమవుతున్నాయని ప్రొఫెసర్ ఫుర్కన్ కుమార్ వ్యాఖ్యానించగా, యుజిసి అదనపు కార్యదర్శి డాక్టర్ పంకజ్ మిట్టల్ ఇటీవల తీసుకున్న చర్యలను వివరించారు. దేశంలో ఉన్నత విద్య పరిణామంపైనా, పరిశోధనలు, ఉస్మానియా యూనివర్శిటీ సేవలు, వర్శిటీల్లో స్వేచ్ఛ, సిబ్బంది కొరత, నిధుల కొరత, సార్వత్రిక విద్య అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.