తెలంగాణ

బస్సులు లేని బస్టాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 27: బహిరంగ సభ పుణ్యమాని సామాన్య ప్రజలకు ఆర్టీసి బస్సులు లేకుండా పోయాయి. వరంగల్ రీజియన్ పరిధిలో సుమారు తొమ్మిది వందల బస్సులు ఉండగా అందులో 80శాతానికి పైగా తెరాస బహిరంగ సభకు అద్దెకు తీసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. బస్ స్టేషన్లకు అడపాదడపా ఒకటి, రెండు రెగ్యులర్ సర్వీస్ బస్సులు ఇలా రావటం, జనాలతో నిండిపోయి వెళ్లిపోవటంతో సీటు సంగతి అటుంచి కనీసం నిలబడటానికి చోటు లేక బస్సు ఎక్కలేని ప్రయాణికులు ఉసూరుమనటం కనిపించింది. నడిచిన అరకొర బస్సులు కూడా ప్రధాన మార్గాలైన హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, భూపాలపల్లి ప్రాంతాలకు పరిమితమయ్యాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులు రద్దవటంతో పల్లెలకు వెళ్లవలసిన జనాలు అవస్థలకు గురయ్యారు.

చిత్రం..హన్మకొండ ప్రధాన బస్‌స్టేషన్‌లో కనిపించని బస్సులు