తెలంగాణ

భద్రాద్రి నుంచి సైకిల్‌పై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 27: మనసుంటే మార్గం ఉండదా అని భద్రాద్రి జిల్లాకు చెందిన సన్నకారు రైతు తూతిక ప్రకాష్ నిరూపించాడు. బిఎస్సీ చదవి గ్రామీణ వైద్యుడుగా పనిచేస్తున్న, పైపెచ్చు ఫ్లూట్ కళాకారుడైన తూతిక ప్రకాష్ వరంగల్ సభకు హాజరు కావటం కోసం తన సొంత సైకిల్‌కు అందంగా గులాబీ రంగు వేయించి జనచైతన్య సైకిల్ యాత్రను ప్రారంభించాడు. ఈనెల 25న ఉదయం భద్రాద్రి నుంచి తన పదేళ్ల కుమారుడితో కలిసి సైకిల్‌పై బయలుదేరిన ప్రకాష్ గురువారం ఉదయం వరంగల్ నగరానికి చేరుకున్నాడు. గులాబీ రంగు సైకిల్, పార్టీ జెండా, తలపై గులాబీ టోపీతో నగరంలో సైకిల్ నడుపుకుంటు వెడుతున్న ప్రకాష్ అందరినీ అకర్షించాడు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రైతులకోసం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షింపబడి బహిరంగ సభకు హాజరుకావటంతోపాటు సభ గురించి ప్రజల్లో ప్రచారం చేసేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.

చిత్రం.. తెరాస బహిరంగ సభకు భద్రాద్రి నుంచి సైకిల్‌పై వచ్చిన తూతిక ప్రకాష్