తెలంగాణ

మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయశంకర్ ప్రాంగణం (వరంగల్), ఏప్రిల్ 27: వచ్చేసారి ఎన్నికల్లోనూ విజయం తమదేనని టిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదం, దీవెనలు ఉన్నంత వరకు అభివృద్ధి ఆగదనీ, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేవరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో గురువారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగించారు. పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో రైతులకు ప్రకటించిన వరాలను ఈ సభలో పునరుద్ఘాటిస్తూనే గడిచిన మూడేళ్ల పాలనలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రజలకు ముఖ్యమంత్రి ప్రగతి నివేదన చేశారు. సుదీర్ఘ పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపిన తమ పార్టీకే పట్టం కట్టడంతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు తమ పార్టీకి పట్టం కడుతున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటును పారదోలడానికి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంటే కాంగ్రెస్ దద్దమ్మలు, సన్నాసులు అడుగడుగున అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. ‘ప్రజల కష్టాలు దూరం చేయాలన్న సద్దుదేశంతో ఒకటో రెండో అనుమతులు లేకున్నా ప్రాజెక్టులు కట్టడానికి ప్రయత్నిస్తుంటే, అది లేదు, ఇది లేదు, తొక్కలేదు, తోలు లేదంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి అడ్డుపడుతున్నారు’ అని విరుచుకుపడ్డారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్ గెలిస్తే చెవి కోసుకుంటానని సిపిఐ నేత నారాయణ సవాల్ చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ‘ఒకాయన చెవి కోసుకుంటానంటాడు. మరో నాయకుడు గడ్డం పెంచుకుంటానంటాడు. వచ్చే ఎన్నికల్లో కూడా మేమే బ్రహ్మండమైన మెజార్టీ గెలవబోతున్నాం. అప్పుడు ఎవరెవరు ఏమేమి కోసుకుంటారో చూద్దాం’ అని కెసిఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు తమను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు వారి హయాంలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్, తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే తాను అడ్డం కాదు, నిలువు కాదంటూ ఎద్దేవా చేశారన్నారు. మరో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు నయా పైసా ఇవ్వనంటే అప్పడు ఇదే కాంగ్రెస్ సన్నాసులు, దద్దమ్మలు ఒక్కరంటే ఒక్కరైనా కనీసం రాజీనామా చేసి నిరసన తెలిపారా? అని ప్రశ్నించారు. వీళ్లకు ఎంతసేపు తమ నేతలకు సంచులు మోయడంతోనే సరిపోయిందని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టులు లేవు, గొట్టపు బావుల ద్వారానైనా సాగు చేద్దామంటే కరెంట్ లేక లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వలస పోయారన్నారు. వారందరిని తిరిగి రప్పించడానికి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరంట్ కష్టాలు తీర్చిందన్నారు. చెరువులను పునరుద్ధరించడం, ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడం, కుల వృత్తుల అండగా నిలిచి ఆర్థిక సహాయం చేయడం వంటి అనేక కార్యక్రమాలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెడుతోందన్నారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.17 వేల కోట్ల రుణ మాఫీ చేయడమే కాకుండా, ఇకనుంచి రైతులకు ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహరక మందుల కొనుగోలు, పెట్టుబడి కోసం వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరానికి నాలుగు వేల చొప్పున రెండు పంటలకు ఇవ్వబోతున్నామన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ రైతన్నలు దేశంలోనే సంపన్న రైతులవుతారని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో కుల వృత్తులపై ఆధారపడిన పేదలు లక్షలాది మంది ఉన్నారన్నారు. వీరిలో గొల్ల, కురుమలు 30 లక్షల మంది వరకు ఉన్నారన్నారు. వీరందరికి ఉచితంగా 84 లక్షల గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వడానికి నాలుగు వేల కోట్లు కేటాయించామన్నారు. మత్స్యకారులు, గీత కార్మికులు, చేనేత కార్మికులను ఆదుకోవడానికి పెద్ద మొత్తంలో బడ్జెట్‌లో నిధులు కేటాయించమన్నారు. సంక్షేమ రంగానికి దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా 40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

చిత్రం..వరంగల్ బహిరంగ సభావేదికపై విక్టరీ గుర్తుతో ప్రజలకు అభివాదం చేస్తున్న సిఎం కెసిఆర్