తెలంగాణ

దేశంలో ఇక ‘మూక్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశంలో ఉన్నత విద్యను కోరుకునే వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరుగుతున్న నేపథ్యంలో వారందరికీ ఉన్నత విద్యను అందించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్టు యుజిసి అదనపు కార్యదర్శి పంకజ్ మిట్టల్ చెప్పారు. ఆంధ్రభూమి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ ఉన్నత విద్యను అందించేందుకు కొత్త విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తే వాటికి పెద్ద ఎత్తున నిధులు, వౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది సమస్యలు తలెత్తకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉన్నత విద్యారంగంలో వివిధ అంశాల్లో స్పెషాలిటీ కోసం మాసివ్ ఆన్‌లైన్ కోర్సులను (మూక్స్)ను ప్రారంభిస్తున్నట్టు ఆమె చెప్పారు. మూక్స్ ద్వారా రెగ్యులర్ విద్యార్థులు సైతం కొన్ని సబ్జెక్టులను అభ్యసించి, వాటికి వచ్చే క్రెడిట్‌లను సంప్రదాయ యూనివర్శిటీల్లో వినియోగించుకునేలా మార్పులు తెస్తున్నామని అన్నారు. స్వయం, స్వయం ప్రభ పేరిట రెండు పథకాలు తెస్తున్నామని, వీటి ద్వారా వివిధ వర్శిటీల మధ్య క్రెడిట్స్ మార్పిడికి వీలుకలుగుతుందని అన్నారు. యుజిసి జ్ఞాన్, ఇ జ్ఞాన్ కోష్ పథకం కింద విదేశాలకు చెందిన ప్రొఫెసర్లను భారత్‌కు ఆహ్వానిస్తున్నామని, వారు వారం పది రోజులు వర్శిటీల్లో ఉండి అవసరమైన సేవలు అందిస్తారని, వారికి అయ్యే వ్యయాన్ని మాత్రం యుజిసి భరిస్తుందని చెప్పారు. నేక్ అక్రిడిటేషన్‌లో ఏ గ్రేడ్ పొందిన వర్శిటీలకు ఈ సదుపాయం కల్పించామని, త్వరలో మిగిలిన వర్శిటీలకు ఈ అవకాశం లభిస్తుందన్నారు. యూనివర్శిటీల మూల్యాంకనం, అక్రిడిటేషన్, రెన్యువల్స్ విషయంలో కూడా టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నామని, దీనివల్ల జవాబుదారీతనం, పారదర్శకత ఏర్పడుతుందని అన్నారు. యుజిసి చుట్టూ ఎవరూ తిరగకుండా అన్ని నిర్ణయాలు ఆన్‌లైన్‌లోనే జరిగేలా చర్యలు చేపట్టామని వివరించారు.