తెలంగాణ

భూదాన్ భూములను ఇళ్లకు కేటాయించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: భూదాన్ యజ్ఞ బోర్డు భూములను పేదలకు భూమి లేని నిరుపేదలు లేదా స్థానిక సంస్థలు నిర్వహించే పాఠశాలల భవనాల నిర్మాణాలకు తప్ప మిగతా ప్రయోజనాలకు కేటాయించరాదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బోర్డు భూములను బలహీనవర్గాలకు ఇండ్ల స్థలాల నిమిత్తం కేటాయించరాదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం కె శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. తెలంగాణ భూదాన్ చట్టం 1965కు సవరణ చేయడాన్ని ఆయన సవాలు చేశారు. తాము జారీ చేసిన ఆదేశాలు జూన్ 15వ తేదీ వరకు అమలులో ఉంటాయని, కేసు విచారణను అదే రోజు చేపడుతామని కోర్టు పేర్కొంది. పిటిషనర్ తరఫున న్యాయవాది వేదుల వెంకట రమణ వాదనలు వినిపిస్తూ, తన క్లయింట్ శ్రీనివాస్ రెడ్డి పూర్వీకులు వెయ్యి ఎకరాలు భూదాన్ ఉద్యమానికి ఇచ్చారని, ఆ భూములను భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలన్న సంకల్పంతో ఇచ్చారన్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల స్థలాలకు కేటాయించాలని చట్టంలో నిబంధనలు చేర్చిందన్నారు. భూదాన ఉద్యమ స్ఫూర్తికి ఈ చర్య విరుద్ధమన్నారు. కాగా ప్రభుత్వానికి చట్టాన్ని సవరించే అధికారం ఉందని ప్రభుత్వ న్యాయవాది శరత్‌కుమార్ తెలిపారు. అనంతరం ఈ కేసులోని అంశాలపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
పిటిషనర్ల దరఖాస్తులనూ స్వీకరించాలి
తెలంగాణలో గురుకుల పాఠశాలల్లో వ్యాయామ టీచర్ల పోస్టులకు తమ దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషనర్ల దరఖాస్తులను స్వీకరించాలని హైకోర్టు పాఠశాల విద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది. జస్టిస్ ఎన్ నవీన్ రావు ఈ ఆదేశాలను జారీ చేశారు. బిపిఇడి డిగ్రీతో పాటు జాతీయ, రాష్ట్ర, అంతర్ రాష్ట్ర పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని, దీని వల్ల బిపిఇడి కోర్సు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోలేరని పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎల్ రవిచందర్ కోర్టుకుతెలిపారు. కొత్త షరతు వల్ల 25వేల మంది అభ్యర్థులు అర్హత కోల్పోతారని ఆయన తెలిపారు. కేవలం ఆరు వేల మంది అభ్యర్థుల దరఖాస్తులు మాత్రమే అర్హత సాధిస్తారని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల దరఖాస్తులను ప్రిన్సిపల్ సెక్రటరీ స్వీకరించాలని ఆదేశిస్తూ, కేసును వేసవి సెలవుల తర్వాతకు హైకోర్టు వాయిదావేసింది.