తెలంగాణ

దళారుల దందాకు కళ్లెం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: రైతులకు ఆర్థిక సాయం చేసే అంశంపై దళారుల ప్రమేయం ఉండకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవడంకోసం తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. 2014లో రుణమాఫీ పథకం ప్రకటించిన సమయంలో దళారులదే రాజ్యంగా కొనసాగిందని ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అనేకపర్యాయాలు గుర్తు చేశారు. రుణమాఫీకంటే ముందు ఆయా ప్రభుత్వాలు చేపట్టిన ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆర్థిక చేయూత చాలా ప్రాంతాల్లో దుర్వినియోగం అయింది. ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది పేర్లతో లబ్ధి పొందారు.
సంబంధిత శాఖల్లో అట్టడుగున పనిచేస్తున్న సిబ్బంది సహకారం ఉండటం వల్ల అక్రమాలకు అవకాశం ఏర్పడ్డదని తేలింది. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన వేరుసెనగ తదితర విత్తనాలను సైతం కొంత మంది తమ పేర్లతో తీసుకుని, అక్కడికక్కడే విక్రయించేసుకున్న సంఘటనలున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఎకరాకు నాలుగు వేల రూపాయలు నిజమైన రైతులకు మాత్రమే అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మొత్తం రైతుల సంఖ్య 55,53,982 గా తేల్చారు. రాష్ట్రంలో ఖరీఫ్‌లో 100 నుండి 110 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఖరీఫ్‌లో 30 లక్షల ఎకరాలు సాగవుతోంది. రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల్లో పళ్లతోటలు, నాలుగు లక్షల ఎకరాల్లో కాయగూరలు పండిస్తున్నారు. ఈ లెక్కలన్నీ రాష్ట్ర గణాంకశాఖ సేకరించినవి కావడంతో వ్యవసాయ శాఖ ద్వారా వివరాలు సేకరించాలని నిర్ణయించారు.
విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ఇస్తుండటంతో సాగవుతున్న భూముల వివరాలు, రైతుల వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఏ గ్రామంలో పూర్తిగా ఎన్ని ఎకరాలున్నాయి? ఎన్ని ఎకరాలు వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు? ఇతర అవసరాల కోసం ఎన్ని ఎకరాలు ఉపయోగిస్తున్నారు? చెరువులు, కుంటలు ఎన్ని ఉన్నాయి. భారీ, మధ్య, చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టుల కింద ఎన్ని ఎకరాలు సాగవుతోంది? ఏయే పంటలు ఏయే సర్వే నెంబర్లలో వస్తున్నారు? గతంలో వేసిన పంటలు ఏమిటి? దిగుబడి ఎంత వచ్చింది? తదితర వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీని వల్ల ఎన్ని ఎకరాలు రాష్టవ్య్రాప్తంగా సాగవుతుందో, ఏయే పంటలు వేస్తున్నారో తేలిపోతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు నాలుగువేల రూపాయల ఆర్థిక చేయూత కోసం రైతుల వివరాలను తాజాగా సేకరిస్తున్నారు. ఏ రైతు ఏ పంట వేస్తున్నాడు? ఏ సర్వే నెంబర్ ఎవరిపేరుతో పట్టా ఉంది? పట్టేదారే స్వయంగా సేద్యం చేస్తున్నాడా? కౌలు రైతులు సాగు చేస్తున్నారా? ఎంత మంది రైతులు భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు? వారికి బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయా? లేకపోతే వెంటనే అకౌంట్లు తెరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని రైతులందరి ఫోటోలతో బ్యాంకు అకౌంట్లు తెరిపించడంతో పాటు, వారి ఆధార్ నెంబర్లను బ్యాంక్ అకౌంట్లతో అనుసంధానం చేయిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నాలుగువేల రూపాయల పథకం నిధులను రైతుల అకౌంట్లలో నేరుగా వేయాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల ఏటా 7000 కోట్ల నుండి 7,500 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో పొందుపరచాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనావేశారు. వాస్తవంగా ఎంత మేరకు నిధులు అవసరం అవుతాయో మరొక మూడు, నాలుగు నెలల్లో స్పష్టంగా తెలుస్తుందని భావిస్తున్నారు. వివరాల సేకరణ బాధ్యతను వ్యవసాయ విస్తరణాధికారులపై పెట్టారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రభుత్వ సొమ్ము దళారుల పాలు కావద్దని, నిజమైన రైతులకే అందాలని భావిస్తున్నారు.