ఆంధ్రప్రదేశ్‌

పట్టాదార్ పుస్తకానికి లంచం అడిగారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం: అవినీతి రహిత పాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం జిల్లా పరిషత్ హైస్కూలులో శనివారం ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఏర్పాటుచేసిన సౌకర్యాలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి తమ పాలనపై ఎంతమంది సంతృప్తిగా ఉన్నారో చేతులెత్తాలని కోరారు. అలాగే అసంతృప్తిగా ఉన్నవారు కూడా చేతులెత్తాలని కోరారు. పోతవరానికి చెందిన అబ్బూరి లక్ష్మీకాంతం తాను అసంతృప్తిగా ఉన్నానని చెయ్యి ఎత్తడంతో చంద్రబాబు ఆమెను వివరాలు అడిగారు. తన భర్తద్వారా సంక్రమించిన పొలానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడానికి విఆర్వో ఫణిబాబు రూ.30వేలు లంచం అడుగుతున్నారని ఆమె చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి 24 గంటల్లో విచారణచేసి విఆర్వోను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్‌ను ఆదేశించారు. లంచగొండి అధికారులవల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు.

చిత్రం.. పట్టాదారు పాస్ పుస్తకానికి లంచం
అడిగారని ఫిర్యాదుచేస్తున్న లక్ష్మీకాంతం