ఆంధ్రప్రదేశ్‌

విశాఖ వాసికి యూఎస్‌లో ఉరిశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిడ్నాప్, హత్య ఆరోపణల నిరూపణ
ఖరారు చేసిన పెన్సిల్వేనియా కోర్టు
విశాఖపట్నం, ఏప్రిల్ 29: కిడ్నాప్, హత్య ఆరోపణలు నిర్ధారణ కావడంతో అమెరికాలోని పెన్సిల్వేనియా కోర్టు విశాఖ వాసికి ఉరి శిక్షను ఖరారు చేసింది. విశాఖ నగరానికి చెందిన యండమూరి రఘునందన్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండేవాడు. దుర్వ్యసనాలకు బానిసైన రఘునందన్ డబ్బుకోసం అమెరికాలోనే నివాసం ఉంటున్న మరో తెలుగు కుటుంబానికి చెందిన సత్యవతి (61), సాన్వి (10 నెలలు)లను 2012 అక్టోబర్ 22న కిడ్నాప్ చేశాడు. కుటుంబీకులను డబ్బుకోసం డిమాండ్ చేసినప్పటికీ తాను చేసిన నేరం బయటపడుతుందన్న భయంతో వీరిద్దరినీ దారుణంగా చంపేశాడు. దీనిపై న్యాయస్థానంలో వాదనల అనంతరం కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే తీర్పుపై రఘునందన్ మరోసారి అప్పీలు చేసుకున్నాడు. మరోసారి వాదనలు విన్న పెన్సిల్వేనియా హైకోర్టు కింది కోర్టు గతంలో విధించిన ఉరిశిక్షనే ఖరారు చేస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. అయితే హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసినప్పటికీ పెన్సిల్వేనియా రాష్టవ్య్రాప్తంగా ఉరిశిక్షల అమలుపై నిషేధం ఉంది. ఉరి శిక్ష ఖరారైన రఘునందన్ తల్లి సత్యవతి విశాఖలో నివాసం ఉంటుండగా, సోదరుడు సతీష్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి గ్రేహౌండ్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ లోతుగెడ్డ వద్ద నక్సల్స్ దాడిలో మృతి చెందాడు.