తెలంగాణ

వీడని.. భూసేకరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: భూ సేకరణ గండం తెలంగాణను వెంటాడుతోంది. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల్లో భూసేకరణ రాష్ట్ర అవతరణకు ముందు నత్తనడక సాగింది. పలు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ దశాబ్దాల పాటు సాగింది. తెలంగాణ ఆవిర్భావంతో ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడంతో భూసేకరణ వేగంగా నిర్వహించాలని నిర్ణయించారు. దానికోసం జీవో 123తో భూసేకరణ కసరత్తు మొదలెట్టారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులను సైతం భాగస్వాములను చేశారు. నియోజక వర్గం పరిధిలో ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతంగా జరిపేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల చొరవతో ప్రాజెక్టుల భూసేకరణ ఊపందుకుంది. ఇదే సమయంలో మెదక్ జిల్లాలో జీవో 123తో భూసేకరణ జరపడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్లడంతో ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. కోర్టు ఆదేశాల కారణంగా ఇప్పటికే ఆరునెలలు ఆలస్యమైందని అధికారులు అంటున్నారు. ఇదిలావుంటే, యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ 2013 చట్టం ప్రకారం దేశంలో ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టుకు కూడా భూసేకరణ జరపలేదని, జరిపే అవకాశం కూడా లేదని నీటిపారుదల శాఖ వర్గాలు అంటున్నాయ. కేంద్రం తెచ్చిన ఈ చట్టాన్ని సవరించుకునే అధికారం రాష్ట్రాలకు ఉండటం, బిజెపి ప్రభుత్వం కూడా సవరణకు అనుకూలంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ సవరణ చట్టం తీసుకొచ్చింది. అసెంబ్లీ తీర్మానం, గవర్నర్ ఆమోదం పొంది ముసాయదాను కేంద్ర అనుమతికి పంపి ఐదునెలలవుతోంది. ఈ సవరణ చట్టంలో మార్పులను సూచిస్తూ కేంద్రం తిప్పి పంపడంతో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా స్పందించింది. దీనిపైనే ఆదివారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో కేంద్రం సూచనల మేరకు అవసరమైన సవరణలు చేసి సభ ఆమోదం పొంది మళ్లీ కేంద్రానికి నివేదించనున్నారు. కేంద్రం అనుకూలంగా స్పందిస్తే ఒకటి రెండు నెలల్లో సవరణ చట్టం అమలులోకి వస్తుందని అధికారులు అంటున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధానమంత్రితో ఈ అంశంపై చర్చించారని, కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు మంత్రులు చెబుతున్నారు. ఆదివారంనాటి అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం కోసం అధికార పక్షం ప్రయత్నిస్తోంది. ఈ సమావేశంలో తెదేపా పాల్గొనే అవకాశం లేదు. బిజెపి, కాంగ్రెస్ సభ్యులు మిర్చి రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. సభా కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే సస్పెండ్ చేసైనా తీర్మానం చేయాలనే పట్టుదలతో అధికార పక్షం ఉంది. ఆదివారం సమావేశంలో సవరణ చట్టం ఆమోదం పొందుతుందని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది.