తెలంగాణ

2013కంటే మెరుగైన చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిఏసిలో సిఎం కెసిఆర్ స్పష్టీకరణ నేడు 11 గంటలకు అసెంబ్లీ, 3 గంటలకు కౌన్సిల్ భేటీ
మిర్చి ఆందోళనలపై చర్చిద్దాం: కాంగ్రెస్ మీరే పంపించి విధ్వంసం చేయించారు : సిఎం

హైదరాబాద్, ఏప్రిల్ 29: భూ సేకరణ బిల్లులోని సవరణలకు ఆదివారం శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయ. శనివారం శాసనసభ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం కొంత సేపు వాడి వేడిగా జరిగింది. సమావేశానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి టి. హరీశ్‌రావు, సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే జి చిన్నారెడ్డి, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ, శాసనమండలి కార్యదర్శి ఎస్. రాజాసదారామ్, జాయింట్ సెక్రటరీ వి నరసింహాచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ భూసేకరణ బిల్లును కేంద్రం తిప్పి పంపినందున సవరణ చేసి పంపాల్సిన అవసరాన్ని వివరించారు. అందుకు సిఎల్‌పి నేత జానారెడ్డి స్పందిస్తూ 2013 నాటి చట్టానే్న యథావిధిగా ఆమోదించాలని కోరారు. లేదా 2013 చట్టంకంటే ఇంకా మంచి చట్టాన్ని తెస్తే తాము సహకరిస్తామన్నారు. అందుకు సిఎం ప్రతిస్పందిస్తూ 2013 నాటి చట్టం కంటే మెరుగైన విధంగా సవరణలు చేస్తున్నాం కాబట్టి ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించేలా సహకరించాలని కోరారు.
మిర్చి అంశంపై గరం గరం
మిర్చి రైతులు గిట్టుబాటు ధర లభించక ఆందోళన చెందుతున్నారని, ఖమ్మంలో ఆగ్రహంతో విధ్వంసానికి దిగినందున రైతుల కష్టాలపై చర్చించేందుకు రెండు రోజుల పాటు సమావేశాలను పొడిగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు. అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిస్పందిస్తూ రాజకీయ కుట్రతో పథకం ప్రకారం దాడి జరిగిందని అన్నారు. ముందుగా మీరే మీడియా వారిని మిర్చి యార్డులకు పంపించి, ఆందోళనలు, విధ్వంసం చేయిస్తున్నారని విమర్శించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని బయట పెడతానని ఆయన అన్నట్లు తెలిసింది. ఇలాఉండగా బిఎసి సమావేశానికి బిజెపి-టిడిపి ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించలేదు. ఈ నెల 16న జరిగిన శాసనసభ సమావేశంలో ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బిజెపి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో, సభా కార్యక్రమాలకు ఆటంక పరుస్తున్నారన్న భావనతో వారిని సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సమావేశాలను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేసినా, గవర్నర్ ప్రొరోగ్ చేయలేదు కాబట్టి ఆ సమావేశాలు ఇంకా కొనసాగుతున్నట్లే కాబట్టి వారికి ఆహ్వానం పంపలేదు. ఆదివారం వారు శాసనసభలో అడుగిడెందుకు అనుమతించరు.
3 గంటలకు కౌన్సిల్
శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశంలో మంత్రి టి. హరీష్‌రావు, ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై కౌన్సిల్‌లో చర్చించి ఆమోదిస్తారు. ఆదివారం 11 గంటలకు అసెంబ్లీ, 3 గంటలకు కౌన్సిల్ సమావేశమవుతాయి.