తెలంగాణ

భారత్ బాహుబలి మోదీయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: ‘్భరత్ బాహుబలి మోదీయే..’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. తాను బాహుబలి సినిమాను చూశానని, సినిమా అద్భుతంగా ఉందని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. కాంగ్రెస్‌ను కాపాడేందుకు బాహుబలి వస్తున్నాడంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, సిఎల్‌పి నేత కె.జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓ విలేఖరి ప్రస్తావించగా, ఆయన నవ్వుతూ తేలిగ్గా తోసిపుచ్చారు. తనకు తెలిసినంత వరకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే బాహుబలి అని ఆయన అన్నారు. దేశాన్ని ప్రధాని మోదీ బహుముఖంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బిజెపి పని అయిపోయిందని భావించిన బడా పార్టీల నేతలంతా యుపి ఎన్నికల ఫలితాలతో షాక్‌కు గురయ్యారని అన్నారు. నోట్ల బదిలీతో ఓట్ల బదిలీ కూడా జరిగిందని ఆయన ఛలోక్తిగా అన్నారు. ప్రజల నాడి తెలిసిన వ్యక్తి ప్రధాని మోదీ అని ఆయన చెప్పారు. కాబట్టి ప్రతిపక్షాలు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలకు అడ్డుపడకుండా, సహకరించాలని ఆయన కోరారు. నకారంగా ఆలోచించరాదని, సకారంగా ఆలోచించాలని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిపక్షాలు గెలుపొందితే ఇవిఎంలు మంచివని, ఓడిపోతే మంచివి కావనడం భావ్యం కాదని అన్నారు. ఇవిఎం అంటే ‘ఎవ్రి ఓట్ మోదీ’ అని ఆయన తనదైన శైలిలో చెప్పారు. మైనారిటీ చాంపియన్లుగా చెప్పుకునే వారు ముందుగా ముస్లిం మహిళల సంక్షేమం గురించి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాఖ్ ముస్లిం మహిళల హక్కులను కాలరాస్తున్నదని ఆయన విమర్శించారు. ట్రిపుల్ తలాఖ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. అన్ని పార్టీలూ దీనిపై రాజకీయాలు మానుకుని సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నించాలని ఆయన కోరారు.
మధ్యంతరానికి అవకాశమే లేదు
మధ్యంతర ఎన్నికలకు వెళ్ళనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెం కయ్య నాయుడు తెలిపారు.