తెలంగాణ

బిజెపి ఎమ్మెల్యేల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: అసెంబ్లీ సమావేశానికి అనుమతించకపోవడంపై బిజెపి ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై రుసరుసలాడారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద ఆదివారం బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు కొంత సేపు నిరసన దీక్ష చేపట్టారు. మెడలో నల్ల కండువా ధరించి, నోటికి నల్లటి గుడ్డ కట్టుకుని వారు పాదయాత్రగా అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో బిసిలకు అన్యా యం చేసే విధంగా ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించడాన్ని అడ్డుకున్నందుకు సభ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. ఆ సభ నిరవధికంగా వాయిదా పడింది కాబట్టి తమను ఈ సమావేశానికి అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశాలకు రాకుండా నియంతృత్వంగా అడ్డుకోవడం సమంజసం కాదని ఆయన విమర్శించారు. నిజాం నిరంకుశ పాలనను గుర్తుకు తెస్తున్నదని అన్నారు. భూ సేకరణకు సంబంధించిన చాలా ముఖ్యమైన చట్టంలో సవరణలు చేసే సమయంలో తమను లేకుండా చేయడం సిగ్గు చేటని అన్నారు. ఆ తర్వాత వారు రాజ్‌భవన్ లో రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సమావేశానంతరం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ గత సభలో సస్పెండైన సభ్యులు ఈ సభకు రాకూడదన్న నిబంధన ఎక్కడ ఉన్నదో చూపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకునే నిర్ణయాలను కోర్టులు కొట్టి వేస్తున్నాయని అన్నారు. భూ సేకరణ చట్టం వల్ల పేద రైతులకు నష్టం వాటిల్లుతుందని, అందుకే తమను సభలోకి రానీయలేదని అన్నారు. కోటి ఎకరాలు సాగులోకి తెస్తామని చెప్పి లక్షల ఎకరాల పచ్చని భూములను రైతుల నుంచి లాక్కుంటున్నారని విమర్శించారు.

చిత్రం. గవర్నర్‌కు వినతి పత్రం అందజేస్తున్నబిజెపి ఎమ్మెల్యేలు