తెలంగాణ

కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: భూ సేకరణ బిల్లుపై రాష్టప్రతికి ఫిర్యాదు చేస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బయటపెడుతోందని మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ప్రాజెక్టులు నిర్మించకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని, కేసులు వేశారని, చివరకు ఇప్పుడు రాష్టప్రతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారంటే వారి ఉద్దేశం ఏమిటో స్పష్టం అవుతోందని అన్నారు. భూసేకరణ చట్టానికి సవరణ బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన తరువాత మంత్రులు మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ వారికి ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టులు నిర్మించలేదు, కాబట్టి మీరు కూడా నిర్మించవద్దు అనేది వారి ఉద్దేశం అని అన్నారు. ప్రాజెక్టులు కట్టనివ్వకుండా కాంగ్రెస్ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కట్టి తీరుతాం అని అన్నారు. టిఆర్‌ఎస్ రైతు సంక్షేమ ప్రభుత్వంగా నిలవడంతో కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తిపోతున్నారని, అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని అన్నారు. చట్టసవరణ బిల్లును వ్యతిరేకించడం అంటే నేరుగా ప్రాజెక్టులను వ్యతిరేకించడమేనని అన్నారు.