తెలంగాణ

రాజ్యాంగ హక్కును కాలరాస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఏప్రిల్ 30: రాజ్యాంగం కల్పించిన హక్కులను సిఎం కెసిఆర్ కాల రాస్తున్నారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్ జి ల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఏఐసిసి నేత దిగ్విజయ్‌సింగ్‌తో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న టిఆర్‌ఎస్ సర్కార్ పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించక అన్నదాతలను అథోగతిపాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులతో పాటు రాష్ట్రంలోని సర్కార్ ప్రజా వ్యతిరేక చర్యలను నిలదీసే అందరిపై అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు పేర్కొన్నారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మార్కెట్ యార్డులలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదని, నిలదీసిన అన్నదాతలను రౌడీలుగా, గుండాలుగా పేర్కొంటుండడం దురదృష్టకరమని నిలదీశారు. కాగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే పంటరుణ మాఫీని ఏకకాలంలో వర్తింపజేస్తామని వివరించారు. కాగా మొదటగా జిల్లాలోని ఏకైక ఎంపిపి వెంకట్‌రాంరెడ్డిని రాష్ట్ర పరిశీలకుడు దిగ్విజయ్‌సింగ్‌కు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, మాజీ ఎంపిపి మోహన్, నేతలు డాక్టర్ శ్రవన్‌కుమార్‌రెడ్డి, సర్దార్‌ఖాన్, రామరాజశర్మ, భానుప్రకాశ్‌రావు, గాలెంక నర్సింలు, నర్సింహాచారి, నరేందర్‌రెడ్డి, మామిడ్యాల శ్రీనివాస్, కిషన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అన్యాయం
కోహెడ: తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్‌సింగ్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార బ్యాంక్‌ను సందర్శించి దాని అభివృద్ధిని సమీక్షించడానికి బయలుదేరిన వీరికి మండలంలోని బస్వాపూర్ వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. బస్వాపూర్‌లోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు సందర్శించి కొనుగోలు తీరును పరిశీలించారు. రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం అనవసరమైన ఆంక్షలు విధించడం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తమ దృష్టికి వచ్చిందని వారన్నారు. ధాన్యాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్యాడీ క్లీనర్లతో ధాన్యాన్ని పరిశీలించడం రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, అలాగే మిర్చి తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతులు రోడ్డెక్కి ధర కల్పించాలని కోరితే ఖమ్మం జిల్లాలో పోలీసులతో అమానుషంగా దాడి చేయించారని విమర్శించారు. ప్రభుత్వ విధానాలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన చెందారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పార్టీ నాయకులు బొమ్మ శ్రీరాంచక్రవర్తి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నేరెళ్ల శారద, స్థానిక నాయకులు కర్ర రవీందర్, భానుమూర్తి, లింగమూర్తి, రమేష్, బాలనర్సు తదితరులు ఉన్నారు.