తెలంగాణ

పోలీసులను అడ్డుపెట్టుకుని భూములు లాక్కుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నదని టి. జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ఆరోపించారు. భూ సేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్ (సేవ్ ధర్నా చౌక్ శిబిరం)లో నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరానికి ప్రొఫెసర్ కోదండరామ్ హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరిట బలవంతంగా, ఏకపక్షంగా లక్షలాది ఎకరాలను రైతుల నుంచి సేకరిస్తున్నదని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రైతుల నుంచి, పేదల నుంచి భూములు లాక్కుంటున్నారని ఆయ న విమర్శించారు. భూ సేకరణ బిల్లును ఆమోదించవద్దని ఆయన అన్ని పార్టీల నాయకులను కోరారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల నాయకుడు హిమతుద్దిన్ మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ కింద ఉన్న 14 గ్రామాలలో 59 రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేసి భూములు లాక్కొవడానికి ప్రయత్నించగా గ్రామస్తులు గట్టిగా ప్రతిఘటించారని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ భూ నిర్వాసితులను పూర్తిగా నిరాశ్రయులుగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అంతకు ముందు భూ నిర్వాసితుల రిలే దీక్షను సామాజిక కార్యకర్త ఎన్. వేణుగోపాల్ ప్రారంభిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో హడావుడిగా బిల్లును ఆమోదించుకున్నదని విమర్శించారు. భూ నిర్వాసితుల దీక్షలు ప్రభుత్వానికి కనువిప్పు కావాలని అన్నారు. ఫార్మాసిటీ భూ నిర్వాసితుల నాయకులు దారా సత్యం, గొలివాడ నిర్వాసితుల సంఘం, వేముల ఘాట్, అనంతగిరి రిజర్వాయర్ల నిర్వాసితుల నాయకులు, టిజెఎసి నాయకులు రవీందర్ రావు, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం కన్వీనర్ మోహన్, డి. లక్ష్మీనారాయణ తదితరులు ప్రసంగించారు. ఆదివారం దీక్షలో పి. ప్రవీణ్‌రెడ్డి, వి. చల్మారెడ్డి, ఈర్ల నర్సింహ, బి. వెంకట్, కె. రవి, పి. హన్మన్‌రెడ్డి, అచ్యుతరావు, టి. సాగర్, ఎం. భగవాన్‌రెడ్డి, కె. అనంతరెడ్డి, కె. ఇంద్రారెడ్డి, ఎ. రంగారెడ్డి, వై. హన్మంతరెడ్డి, ఎండి యాకుబ్, వై. రఘోత్తంరెడ్డి, వి. కుమార చారీ, శ్రీశైలం ముదిరాజ్, వి. రాములు, సి. కృష్ణ, సి. నర్సయ్య, నర్సింహారెడ్డి, సత్తయ్య, భాస్కర్, శిల్పారాం దుకాణాల సంఘం నాయకులు చిన్న, నిరంజన్‌రావు, ధర్మానాయక్, రాంచందర్, ఆర్. వెంకటేశ్వర్లు, ఆర్. ఆంజనేయులు, రాములు, బి. ప్రసాద్, పి. జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.