తెలంగాణ

ఆగస్టు 15లోగా ఈ-పంచాయతీ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఆగస్టు 15లోగా ఈ-పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సిపార్డులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, సెర్ప్‌లపై మంత్రి సమీక్షించారు. ఈ-పంచాయతీ, ఉపాధి హామీ, హరిత హారం, కార్యదర్శుల రేషనలైజేషన్ తదితర అంశాలపై కమిషనర్ నీతూ ప్రసాద్‌తో పాటు ఇతర అధికారులతో చర్చించారు. గ్రామాల్లో అన్ని రకాల పౌర సేవలను ఆన్‌లైన్‌లో అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఐదువేల పంచాయతీల్లో కంప్యూటర్లు ఉన్నాయని, ప్రింటర్లు, ఇంటర్‌నెట్ డాంగిల్స్ కొనుగోలు చేసేందుకు అనుమతించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆగస్టు 15 నాటికి గ్రామంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పన్నుల చెల్లింపు లాంటి అన్ని సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తారు. దీని కోసం పంచాయతీ కార్యదర్శులకు కంప్యూటర్ల వినియోగంపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే పంచాయతీల్లో చెత్త సేకరణ కోసం 17వేల ట్రై సైకిళ్లను పంపిణీ చేసినట్టు చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులను పంచాయతీలే నియమించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పంచాయతీల్లో పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయని , 89 శాతం పన్నులు వసూలు అయినట్టు అధికారులు మంత్రికి వివరించారు. కొందరు కార్యదర్శులకు నాలుగైదు గ్రామాల బాధ్యత అప్పగించడం వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని, వీరిని రైషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే 785 కేంద్రాల ద్వారా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.