తెలంగాణ

అది చట్టవిరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: శారీరక కొలతలు నిబంధనల ప్రకారం లేవంటూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ 2008 డిసెంబర్ 30న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన 165 మంది అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లలో 15 మందిని తొలగించడం చెల్లదని ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించింది. 169 మంది ఎంపిక ప్రక్రియ పూర్తయి శిక్షణ పొందుతుండగా ఉత్తీర్ణత సాధించని వారుదాఖలు చేసిన కేసుల నేపథ్యంలో ప్రభుత్వం శారీరక కొలతలు, పరీక్షలు నిర్వహించడానికి రెండోసారి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయటం చట్టవిరుద్ధమని, ఇది ఎపిపిఎస్‌సి పరిధిలో జోక్యం చేసుకోవడమేనని తేల్చి చెప్పింది. నియామక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా ఎంపిక కాని కొంత మంది ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో మరిన్ని వివాదాలు తలెత్తాయని వ్యాఖ్యానించింది. 15 మంది తొలగింపును సమర్ధిస్తూ, వారి స్థానంలో అర్హులను నియమించాలంటూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2008లో 218 మంది ఎఎంవిఐల ఎంపికకు ఎపిపిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసి రాతపరీక్ష నిర్వహించింది. అనంతరం శారీరక కొలతల విభాగంలోనూ అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి 169 మందిని ఎంపిక చేసింది. వారిని 2012 మార్చి నుండి మే వరకూ శిక్షణకు పంపించింది. అనంతరం ఎంపిక ప్రక్రియ పూర్తయి శిక్షణకు పంపించాక, పలువురు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. శారీరక కొలతలు సక్రమంగా తీసుకోలేదని, అర్హత లేని వారిని ఎంపిక చేశారంటూ పలు పిటీషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు శారీరక పరీక్షలు నిర్వహించడానికి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సీనియర్ డాక్టర్లతో అదీ గతంలో నిర్వహించిన వారు కాకుండా మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని వైద్య విద్య డైరెక్టర్‌ను ఆదేశించింది. డిఎంఈ అదే రోజు వరంగల్ ఎంజిఎం ఆస్పత్రి డాక్టర్లతో బోర్డు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు అందరికీ పరీక్షలు నిర్వహించగా, 83 మందికి అర్హత లేదని బోర్డు నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం ఇద్దరు అధికారులతో కమిటీ వేసి నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 83 మందిలో 15 మంది నియామకం చెల్లదని కమిటీ నిర్ణయించగా వారికి షోకాజ్‌లు ఇచ్చిన అనంతరం తొలగిస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ట్రిబ్యునల్ సమర్ధిస్తూ, వారి స్థానంలో అర్హులను నియమించాలంటూ మరికొన్ని పిటీషన్లలో తీర్పు వెలువరించింది. వీటన్నింటిపై దాఖలైన పలు పిటీషన్లపై హైకోర్టు తీర్పు వెలువరిస్తూ నియామక ప్రక్రియలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనపుడు రెండో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలన్న నిర్ణయమే తప్పని తేల్చింది. ఒక తప్పు మరో తప్పునకు దాని నుండి మరో దానికి కొనసాగి గందరగోళం ఏర్పడిందని వ్యాఖ్యానించింది. రెండోసారి బోర్డు ఏర్పాటు చేసే ముందు ఎపిపిఎస్‌సిని ఎందుకు సంప్రదించలేదని ఇది కమిషన్ పరిధిలోకి జోక్యం చేసుకోవడమేనని తేల్చింది. రెండో సారి ఏర్పాటు చేసిన బోర్డు 83 మందిని అనర్హులుగా తేల్చగా ఇందులో కమిటీ 15 మందిని మాత్రమే తొలగించడం సహేతుకంగా లేదని తెలిపింది. రెండో సారి బోర్డు ఏర్పాటు చట్టవిరుద్ధమైన నేపథ్యంలో తదనంతర చర్యలు అన్నీ చెల్లవని, వీరి తొలగింపు చెల్లదని స్పష్టం చేస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రద్దుచేసింది. డాక్టర్‌లపైనా చర్యలు తీసుకోవాలని, రెండో బోర్డు నివేదిక ప్రకారం 83 మందినీ తొలగించాలని వారి స్థానంలో తమను నియమించాలంటూ దాఖలైన పలు పిటీషన్లను కూడా కొట్టివేసింది.