తెలంగాణ

ఒక ఐపి.. రెండు డిస్పెన్సరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: కార్మికుల, ఉద్యోగుల, వేతన సాంఘిక భద్రతలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రెండు పథకాలను ప్రారంభించినట్టు ఆయన వివరించారు. ఒక ఐపి- రెండు డిస్పెన్సరీలు, ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ క్లయిమ్ సమర్పణ పేరుతో వీటిని ప్రారంభించామని అన్నారు..మొదటి పథకం కింద కార్మిక రాజ్య బీమా సంస్థ ద్వారా బీమా చేయించుకున్న వ్యక్తి రెండు డిస్పెన్సరీలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించామని అన్నారు. ఒకటి తన కోసం , మరొకటి తన కుటుంబం కోసం యజమాని ద్వారా ఎంచుకోవచ్చు. వలస వెళ్లే కార్మికులకు, ముఖ్యంగా ఈ సదుపాయం వల్ల వారి కుటుంబ ఆరోగ్య అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఒక కార్మికుడు తన సొంత రాష్ట్రంలోనే గాక వేరొక రాష్ట్రంలో పనిచేస్తున్నపుడు కూడా తన రాష్ట్రంలో ఉన్న కుటుంబ సభ్యులు, డిస్పెన్సరీ సేవలను ఉపయోగించుకోవడంలో ఇక నుండి ఎటువంటి సమస్య ఉండదని అన్నారు. ఇంత వరకూ ఇఎస్‌ఐసి ద్వారా సుమారు మూడు కోట్ల మంది కార్మికులు బీమాను పొందారని చెప్పారు. ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ క్లయిమ్ ద్వారా , ఉద్యోగ భవిష్యనిధి సభ్యులు ఎవరైతే ఆధార్ సంఖ్యను జోడించి యూనివర్శల్ అకౌంట్ నెంబర్‌ను కలిగి ఉన్నానరో వారంతా ఇపుడు తుది పరిష్కారం , పెన్షన్ ఉపసంహరణ, పిఎఫ్ పాక్షిక ఉపసంహరణను ఇంటర్‌ఫేజ్ ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా సమర్పించుకోవచ్చని తెలిపారు.