తెలంగాణ

డిసెంబర్‌లోగా గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: ఈ ఏడాది చివరి నాటికి గోదావరి, కృష్ణాజలాలు మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు చేరుకునే విధంగా పని చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పనులపై ఇక నుంచి ప్రతి రోజు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. సోమవారం కెసిఆర్ ప్రగతి భవన్‌లో భగీరథ పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వర్కింగ్ ఏజెన్సీలు సమన్వయంతో వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. ఇంటింటికీ తాగునీటి పైపు లైన్లతో పాటు ఫైబర్ కేబుల్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. వర్కింగ్ ఏజెన్సీలు తమ పద్ధతి మార్చుకుని, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని అన్నారు. వర్షాకాలం వచ్చేలోగా పంట పొలాల్లో జరగాల్సిన పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. మిషన్ భగీరథకు కావాల్సిన విద్యుత్ సౌకర్యం అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావును సిఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపి కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ తదితరులు పాల్గొన్నారు.