రాష్ట్రీయం

కొత్త చట్టాలు అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: దేశంలో కొత్త చట్టాలు అక్కర్లేదని, ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, హక్కులూ లభిస్తాయని ఉభయ తెలుగు రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా పిజి లా కాలేజీలో మూడు రోజుల పాటు జరిగే తొలి జాతీయ న్యాయవిద్యా సమ్మేళనం, ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మాట్లాడుతూ మనకు అనేక చట్టాలు ఉన్నాయని, కాని వాటి పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రజలు ఆ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేయడం లేదని అన్నారు. దీనిని పాలకులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని, ఫలితంగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. కోట్లకు పడగలెత్తిన వాళ్లు కోర్టుకు వెళ్లకుండానే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారని, సామాన్యులు మాత్రం న్యాయస్థానానికి వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో కీలకమైన పదవుల్లో ఉన్నవారికి సైతం చట్టాలపై సరైన అవగాహన లేదని చెప్పారు. ప్రిన్సిపాల్ గాలి వినోద్‌కుమార్ ఆలోచన దేశానికే ఆదర్శంగా ఉందని అన్నారు. పిజి న్యాయ కళాశాలలో ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలను న్యాయవిద్యార్ధులే కాదు, న్యాయ నిపుణులు, న్యాయవాదులు, సామాన్య ప్రజలు అంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
జాతీయ బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ అన్ని సమస్యలకూ పరిష్కారం మన రాజ్యాంగంలో ఉందని, అయితే మనకీ హక్కులు ఉన్నాయని చాలా మందికి తెలియదని అన్నారు. స్వాతంత్య్రానికి ముందే కాదు, తర్వాత కూడా సామాజిక న్యాయం కనిపించడం లేదని అన్నారు. దీనికి కారణం మనమంతా హక్కులను గురించి మాట్లాడుతున్నాం కానీ, బాధ్యతలను మరిచిపోతున్నామని చెప్పారు. వ్యక్తి మారినపుడే వ్యవస్థలో మార్పు వస్తుందని అన్నారు. ఇది విజ్ఞాన ప్రదర్శన కాదని, అనేక సమస్యలకు పరిష్కార వేదికగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారని అన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ పి విజయబాబు మాట్లాడుతూ న్యాయవిద్యార్థులు అవినీతిపై సమర శంఖారావాన్ని పూరించాలని అన్నారు. సమ సమాజం సాధ్యమైనపుడే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కన్న కలలు సాకారం అవుతాయని అన్నారు.
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ తామంతా రాజకీయ మార్పునకు చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని సూచించారు. బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు మాట్లాడుతూ సామాజిక న్యాయం ద్వారా మాత్రమే సామాజిక మార్పు సాధ్యమని చెప్పారు. ఎప్పటికపుడు కొత్త చట్టాల గురించి మాట్లాడున్నాం తప్ప బాధ్యతలను మరిచిపోతున్నామని అన్నారు. సభలో మహాబాయి వాటర్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ పిఎస్ నారాయణ, ఉస్మానియా పూర్వ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మి, స్టేట్ లీగల్ సెల్ అథారిటీ ఎఓ రత్న ప్రభావతి, పిజి కాలేజీ డైరెక్టర్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఉస్మానియా పిజి లా కాలేజీలో నిర్వహించిన తొలి జాతీయ న్యాయవిద్యా సమ్మేళనంలో
ప్రసంగిస్తున్న తెలుగు రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి