తెలంగాణ

నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నకిలీ విత్తనాల బెడద లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్షించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిని జైలుకు పంపించే విధంగా కఠినమైన చట్టం రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయాలని సూచించారు. విత్తనాలు కల్తీవి, నాసిరకానివి సరఫరా చేసే సంస్థలపై ఉక్కుపాదం మోపాలని సిఎం ఆదేశించారు. ప్రాథమిక సహకార సంఘాల ద్వారానే విత్తనాలు, ఎరువులను సరఫరా చేయాలని సిఎం ఆదేశించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ప్రభుత్వపరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని, అవసరమైతే సంబంధిత ఆహార పంటలను ప్రాసెసింగ్ చేసేందుకు రైతులకు చేయూత ఇవ్వాలని ఆదేశించారు. 2017 ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులను కేటాయించాలని కేంద్ర ఎరువుల మంత్రి అనంతకుమార్‌ను ఫోన్లోనే ఆయన కోరారు. వ్యవసాయ విస్తరణాధికారులు 2017 మే 10 నుండి జూన్ 10 వరకు గ్రామాల్లో పర్యటించాలని, వ్యవసాయ భూముల వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఒక్కో విస్తరణాధికారి పరిధిలో మొత్తం భూమి ఎంత ఉందో, ఎంత సాగవుతోందో, ఏయే పంటలు వేస్తున్నారు, మైక్రోఇరిగేషన్ వాడుతున్నారా తదితర వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం ఒక్కటే అవసరానికన్నా ఎక్కువ పండుతోందని, ఇతర ఆహార పంటలను అవసరాలకు సరిపడా పండించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు పండించేందుకు ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేయాలని కోరారు.

చిత్రం..సోమవారం ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్