తెలంగాణ

ఆర్టీసీ ఎండికి ఉత్తమ నిర్వహణ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావుకు ఉత్తమ నిర్వహణ పురస్కారం (బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డు) లభించింది. కార్మిక దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, కార్మికశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రజా రవాణాలో వ్యవస్థలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న టిఎస్‌ఆర్టీసీ నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్నందుకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రమణరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆవిర్భవించిన నాటి నుంచి ఎన్నో అవార్డులు వరించాయని, ఈ ఘనత కార్మికుల కృషి ఫలితమేనని తెలిపారు.