తెలంగాణ

5న గీతం ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: గీతం విశ్వవిద్యాలయం బిటెక్, ఎంటెక్, బి ఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలను ఈ నెల 5వ తేదీన వెల్లడించనున్నారు. హైదరాబాద్ ప్రాంగణంతో పాటు దేశవ్యాప్తంగా 48 కేంద్రాల్లో గీతం పరీక్షకు 70వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో పరీక్షకు 90 శాతం మంది హాజరయ్యారని అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె నరేంద్ర పేర్కొన్నారు. వీరికి 15 నుండి 18వ తేదీవరకూ ఆన్‌లైన్ కౌనె్సలింగ్ నిర్వహిస్తారు.
చికాగోలో ఉస్మానియా శతాబ్ది
చికాగోలో ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను మే 14న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాన్సుల్ జనరల్ నీతా భూషణ్, సిఐఓ గవర్నర్ కార్యాలయం హర్దిక్ భట్, ఆర్‌జియుకెటి విసి సత్యనారాయణ ఎస్, మీర్ ఖాన్ గ్లోరీ ఆఫ్ హైదరాబాద్ సంస్థ అధ్యక్షుడు పాల్గొంటారు.
పిజి వైద్య ఫీజులు పెంచొద్దు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల పిజి మెడికల్ కాలేజీల ఫీజులను పెంచాలనే అనాలోచిత నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు బి చందూనాయక్, ప్రధానకార్యదర్శి మూడ్ శోభన్ నాయక్‌లు డిమాండ్ చేశారు.
కోఠీ మహిళా కళాశాల కొత్త ప్రిన్సిపాల్ ప్రశాంత
కోటి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి టి సీత పదవీవిరమణ చేయడంతో ఆమె స్థానంలో ప్రొఫెసర్ ప్రశాంత అత్మ నియమితులయ్యారు.
ముగుస్తున్న గడువు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో వివిధ కోర్సుల్లో దరఖాస్తుకు ఈనెల 5వ తేదీతో గడువు ముగుస్తున్నట్టు అధికారులు తెలిపారు. 11 కొత్త కోర్సులతో పాటు 126 కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టువారు చెప్పారు. గత ఏడాది 1896 సీట్లు ఉండగా, ఈ ఏడాది అవి 2065 సీట్లకు పెరిగాయని వాటితో పాటు మరో 44 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయని అధికారులు వివరించారు.
ఆధార్ తప్పనిసరి
ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీల్లో చేరాలంటే ఆధార్‌ను తప్పని సరి చేసినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఇందుకు వీలుగా విద్యార్ధులు ముందుగా ఆధార్‌ను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.