తెలంగాణ

మూసీ ప్రక్షాళన వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: నగర ప్రజలకే కాదు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల వరకూ కంపు కొడుతున్న మూసీ నదికి మోక్షం రాబోతున్నది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తున్నది. మూసీలో స్వచ్ఛమైన నీరు గలగలా పారేలా చూస్తామని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు ఇదివరకే పలు పర్యాయాలు ప్రకటించారు. ఈ మేరకు మొత్తం మీద అంకురార్పణ జరిగింది. మూసీ మురుగు శుద్ధికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డిసిఎల్), హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డిసిఎల్) సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థల ద్వారా మూసీ ప్రక్షాళనకు అవసరమయ్యే మూడు వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి వీలు కల్పిస్తూ మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌పివి (స్పెషల్ పర్పస్ వెహికిల్)లకు అవసరమైన గ్యారంటీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. మూసీ ప్రక్షాళన, పరిశుభ్రత, పరిసరాలు అందంగా తీర్చిదిద్దేందుకు 4 వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని అంచనా. ప్రతి రోజూ మూసీ నదిలోకి 1,400 మిలియన్ లీటర్ల మురుగు నీరు వచ్చి చేరుతున్నది. దీంతో హైదరాబాద్, నగర శివారు ప్రాంతాలు, నది ప్రవహించే దిగువ ప్రాంతాలు, ఇంకా నది ప్రవహించే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఆ చుట్టు పక్కల ప్రాంతాలు గొట్టపు బావులు వేస్తే కలుషిత నీరు రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాఉండగా నీరు ప్రవహించే కాల్వ పొడుగునా 10 చోట్ల మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లను నెలకొల్పనున్నారు. ఒక్కో ప్లాంట్ సామర్థ్యం 610 ఎంఎల్‌డి ఉంటుందని అధికారులు తెలిపారు. వీటికి 1,200 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. ఈ మేరకు ఎంఆర్‌డిసిఎల్ 1,500 కోట్ల రూపాయల నిధుల సమీకరణ చేయనుండగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యారంటీ కమిషన్ అందజేయనున్నది. నదీ ప్రవహించే ప్రాంతాల్లో ప్లాంట్లు నెలకొల్పుకోవడానికి ప్రభుత్వ భూమిని ఎంఆర్‌డిసిఎల్‌కు బదలాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.