తెలంగాణ

ఎత్తుగా లేరని మహిళలకు ఉద్యోగం ఇవ్వకపోవడం తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: ఎత్తు తక్కువగా ఉన్నారనే కారణంపై కారుణ్య నియామకల విధానంలో ఒక మహిళకు టిఎస్‌ఆర్టీసి ఉద్యోగం ఇవ్వకపోవడం తప్పని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమకు కారుణ్య నియామకాల కింద టిఎస్‌ఆర్టీసి ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ బి అన్నపూర్ణ, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు విచారించారు. ఉద్యోగాలకు ఈ మహిళలు ఎంపికైనా, నిర్దేశించిన 151 సెం.మీ ఎత్తు లేరని, అందుకే ఉద్యోగం ఇవ్వడం లేదని టిఎస్‌ఆర్టీసి పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధం, వివక్షతతో కూడుకున్న నిర్ణయమని న్యాయమూర్తి పేర్కొన్నారు. కారుణ్య ఉద్యోగ నియామకాల్లో మహిళలను ఎత్తు తక్కువగా ఉన్న కారణంపై తిరస్కరించడం వల్ల ఐక్యరాజ్యసమితి, చట్టసభల్లో మహిళల పట్ల సమానంగా వ్యవహరిస్తామన్న రాజ్యాంగ బద్ధమైన హామీని ఉల్లంఘించినట్లవుతుందని హైకోర్టు పేర్కొంది. కండక్టర్ ఉద్యోగానికి కనీసం 151 సెం.మీ ఉండాలని, వీరు ఎత్తుగా లేకపోతే పడిపోకుండా ఉండేందుకు బస్సులో పైన ఉన్న రాడ్‌ను పట్టుకోలేరని ఆర్టీసి సంస్థ న్యాయవాది పేర్కొన్నారు. రాడ్‌ను పట్టుకోలేని స్థితిలో కండక్టర్లు పడిపోయి గాయాలు పాలవుతారన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని పురుషులతో పోల్చితే మహిళలు ఎత్తుగా ఉండరని, భారతదేశంలో మహిళల సగటు ఎత్తు 150 సెం.మీ అని, ఈ సూత్రాన్ని పాటిస్తే కండక్టర్ ఉద్యోగాలు మహిళలు ఎవరూ అర్హులు కారన్నారు. కొందరు 146 సెం.మీ ఉన్నా ఉద్యోగానికి అర్హత ఉన్నట్లు ఆర్టీసీ మినహాయింపు ఇచ్చిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. తక్కువ ఎత్తు ఉంటే, పైన రాడ్‌ను పట్టుకోలేక పడిపోతారని, గాయాలు తగులు తాయని ఒక సంఘటననైనా ఆర్టీసి అధికారులు చెప్పలేకపోయారన్నారు. ఇది కేవలం ఊహాజనితమైన వాదన అన్నారు. ఈ పిటిషనర్లను ఉద్యోగాల్లో నియమించే విషయమై పరిశీలించాలని , బ్రెడ్ విన్నర్స్ స్కీం కింద వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని, రెండు నెలల్లోపల ఉద్యోగంలో నియమించాలని, అభ్యంతరం ఏదైనా ఉంటే ఆ లోపల తమ అభిప్రాయాన్ని కోర్టుకు తెలియచేయాలని హైకోర్టు ఆర్టీసిని ఆదేశించింది.