తెలంగాణ

బొగ్గు గనుల ‘ప్రైవేటు’ను అడ్డుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: తాడిచర్ల గనుల ప్రైవేటీకరణను అడ్డుకుందామని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కార్మికులకు పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు గనుల్లోని తాడిచర్ల బ్లాక్‌ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఐ మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కోదండరామ్ ప్రసంగిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ గనుల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని అన్నారు. సింగరేణి బొగ్గు గనులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సామాజిక విప్లవం తెచ్చిందని, గ్రామాలలో ఉన్న అధిపత్యం నుంచి బయటపడడానికి గనుల్లో పని చేసే అవకాశాన్ని సింగరేణి సంస్థ కల్పించిందన్నారు. ఇలాంటి గనుల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ నల్ల బంగారంగా పిలిచే సింగరేణికి 127 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తాడిచర్ల బ్లాక్‌ను ప్రైవేటీకరించాలనుకోవడం దురదృష్టకరమని అన్నారు. బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర బొగ్గు గనుల, కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగిస్తూ ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలను అణిచి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. విద్యావంతుల వేదిక నాయకుడు రవీందర్ మాట్లాడుతూ అఖిలపక్షం చేపట్టే ఉద్యమాల్లో ముందుంటామని అన్నారు.

చిత్రం..సిపిఐ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న జెఎసి చైర్మన్ కోదండరామ్