తెలంగాణ

కొత్త మండలాల్లో 84 కెజిబివిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలు సమర్ధవంతంగా పనిచేసేలా పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడమేగాక, డిమాండ్ మేరకు కొత్త స్కూళ్లను కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విద్యాశాఖకు కావల్సిన నిధులను కేంద్రం నుండి వీలైనంత ఎక్కువగా తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులతో కేంద్ర ప్రాయోజిత పథకాలపై సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గతంలో కేంద్ర పథకాలు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల నిధులు సరిగా రాలేదని, తాను వచ్చాక ప్రత్యేక దృష్టి పెట్టడంతో 2016చివరి క్వార్టర్లో సర్వశిక్షా అభియాన్‌లో 300కోట్ల రూపాయలు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌లో 110కోట్లు రూపాయిలు దనంగా వచ్చాయని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
ఇదే విధానాన్ని ఇక నుండి కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ విద్యాసంవత్సరం మొదటి నుండే కేంద్ర పథకాలకు వచ్చే నిధులను రాబట్టేందుకు ప్రయత్నించాలని, వచ్చిన నిధులను సకాలంలో ఖర్చు చేసి వినియోగపత్రాలను సమర్పించాలని సమావేశంలో అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కెజిబివిలను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కెజిబివిల్లో ఈ విద్యాసంవత్సరం నుండి ఫర్నీచర్, బెడ్ మెటీరియల్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రోడక్టుల కిట్ ఇస్తామని వెల్లడించారు. ఈ కిట్‌లో బాలికలకు అవసరమైన అన్ని వస్తువులూ ఉంటాయని అన్నారు. ఇక కొత్తగా ఏర్పడిన 84 మండలాల్లో కెజిబివిలను కొత్తగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం బాలికలకే పరిమతం అయిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను బాలుర కోసం కూడా నెలకోల్పుతామని అన్నారు. 29 జిల్లా కేంద్రాల్లో బాలుర కోసం 29 కస్తూర్బా గాంధీ బాలుర విద్యాలయాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. వీటి ఏర్పాటుకు ఆర్ధిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. ఈ ఏడాది నుండి ఆరువేల స్కూళ్లలో బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి పాఠశాలలో వాడుకునే విధంగా టాయిలెట్లు, రన్నింగ్ వాటర్, సిసి కెమరాలు ఉంటాయని అన్నారు. రన్నింగ్ వాటర్ కోసం బోర్డులేని చోట కనీసం ట్యాంకుల్లో నీరు నింపి టాయిలెట్లను వాడుకునే వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. 500 కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ముగ్గురు వర్కర్లు పెట్టుకోవాలని, ఇందుకోసం 75వేల రూపాయిలను ఏటా ఇస్తామని అన్నారు. ఈ నిధులను పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విడుదల చేస్తామని వెల్లడించారు.