తెలంగాణ

వర్షాలతో తగ్గిన ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: 2017 ఎండాకాలంలో ఎండలు మండుతాయి అని భావిస్తున్న సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వారం కిందటి వరకు వివిధ ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ వరకు చేరిన అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 41 డిగ్రీలకు తగ్గింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే కాకుండా తమిళనాడు, కర్నాటక, కేరళలలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ కేందం ప్రకటించింది. ఎండాకాలంలో ఇప్పుడు వర్షాలు కురవడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షాపాతం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా మందసలో 9 సెంటీమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఏడు సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆరుసెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా పినపాక, గూడూరు వరంగల్‌లలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, చిత్తూరు, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షం కురిసింది.