జాతీయ వార్తలు

కళాతపస్వికి ఫాల్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక బాబా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. విజ్ఞాన్ భవన్‌లో బుధవారం సాయంత్రం జరిగిన 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో విశ్వనాథ్‌కు ఫాల్కేతోపాటు ఉత్తమ అవార్డులను పలువురు సినీ ప్రముఖులకు రాష్టప్రతి అందించారు. కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు సమావేశానికి ఆధ్యక్షత వహించారు. కాశీనాథుని విశ్వనాథ్‌కు మొదట శాలువ కప్పి సత్కరించిన రాష్టప్రతి, అనంతరం దాదా సాహెబ్ పాల్కే అవార్డు, ప్రశంసా పత్రాన్ని ఆహూతుల కరతాళధ్వనుల మధ్య అందించారు. శతమానంభవతి సినిమాకు లభించిన స్వర్ణ కమలం అవార్డును చిత్ర దర్శకుడు వి సతీష్ అందుకున్నారు. పెళ్లిచూపులు చిత్రానికి లభించిన రజత కమలం అవార్డును చిత్ర దర్శకుడు డి తరుణ్‌భాస్కర్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ స్వీకరించారు.
సర్వేజనాః సుఖినోభవంతు
సర్వజనులంతా సుఖంగా ఉండాలని పాల్కే అవార్డు స్వీకరించిన విశ్వనాథ్ అభిలషించారు. అవార్డు స్వీకారం సందర్భంగా మాట్లాడుతూ ‘అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు లభించినందుకు సంతోషంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్టప్రతి, కేంద్ర మంత్రి వెంకయ్య, జూరీ సభ్యులు, తన విజయాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పాల్కే అవార్డు లభించినందుకు తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నానని విశ్వనాథ్ ప్రకటించగానే సభికులు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు.
అన్నిమతాల మతం సినిమా
మన దేశంలో అన్ని మతాల మతమైన సినిమా జీవితానికి అద్దం పడుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. జీవితంలో బోరును పారదోలేవాటిలో సినిమాకూ స్థానం ఉందన్నారు. ‘సినిమాకు భాషతో సంబంధం లేదు. భాషరాకున్నా అర్థం అవుతుంది. దాని సందేశం మనకు చేరుతుంది. సినిమా అత్యంత అందమైన భావ వ్యకీకరణ’ అన్నారు.
మని ఆయన ప్రశంసించారు. సినిమా దేశాన్ని సమైక్యపరుస్తోందన్నారు. ‘విశ్వనాథ్ సినిమాల్లో హింస, అసభ్యత, ఘర్షణలు, నగ్నత్వం ఉండదు. అది ఆయన ప్రత్యేకత’ అని వెంకయ్య కొనియాడారు. కొత్త దర్శకులకు ఆయన స్ఫూర్తి అన్నారు.

చిత్రం... రాష్టప్రతి ప్రణబ్ నుంచి ఫాల్కే అవార్డు, ప్రశంసాపత్రం అందుకుంటున్న దర్శకుడు కె విశ్వనాథ్