తెలంగాణ

బస్సు భారం మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కిస్తాం
జిహెచ్‌ఎంసి నుంచి నెలనెలా కొంత చెల్లింపు
విద్యుత్ రుణాలనూ కూడా ఇలాగే తీరుస్తున్నాం
వజ్ర బస్సుల ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్ వెల్లడి

హైదరాబాద్, మే 4: ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. సమైక్య రాష్ట్రం లో ఆర్టీసి ఉంటుందా? ప్రైవేట్ పరం అవుతుందా అనే డోలాయమాన స్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.750 కోట్లను ప్రభుత్వమే ఇచ్చి అప్పులు తీర్చి సంస్థను బతికించుకునే ప్రయత్నం చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో 23 జిల్లాల పరిధిలో ఉన్న ఆర్టీసికి కూడా ఎనాడు బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించలేదని, అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 1000కోట్లు కేటాయించామని సిఎం గుర్తుచేశారు. ప్రగతి భవన్‌లో గురువారం వజ్ర, పల్లెవెలుగు, బయోడీజిల్‌తో నడిచే బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసి కార్మికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఒక్క హైదరాబాద్ నగరంలోనే మూడు వేల బస్సులు నడుపుతున్నామన్నారు. ఇంత పెద్ద మొత్తంలో బస్సుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో మొత్తంగా కూడా లేవన్నారు. హైదరాబాద్ నగరంలో ఆర్టీసికి వచ్చే నష్టాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భరించే విధంగా శాసనసభలో చట్టం చేశామన్నారు. ఇక నుంచి క్రమం తప్పకుండా నెలనెలా ఆర్టీసికి జిహెచ్‌ఎంసి నుంచి డబ్బులు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆర్టీసిపై కోట్ల మంది ఆధారపడి ఉన్నారని, ప్రతీరోజు 90 లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసి చేరవేస్తుందన్నారు. మూడింట ఒక వంతు తెలంగాణ ‘ ఈజ్ ఆన్ వీల్స్ ఆఫ్ ఆర్టీసి’ అని ముఖ్యమంత్రి అన్నారు. తాను గతంలో రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న ఆర్టీసిని గట్టెంక్కించే ప్రయత్నం చేశానని గుర్తు చేశారు. రవాణామంత్రి, ఆర్టీసి చైర్మన్, అధికారులు, కార్మికులు చిత్తశుద్దితో పని చేస్తే ఆర్టీసిని శాశ్వతంగా నష్టాల నుంచి లాభాల దిశగా పయనిస్తుందని సిఎం అన్నారు. ప్రయాణికులు బస్టాండ్లకు వెళ్లనవసరం లేకుండా వారు ఉన్న చోటికే బస్సులు వచ్చే వినూత్నమైన ‘వజ్ర’ బస్సుల ప్రయోగాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ప్రయోగాత్మకంగా వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు ప్రవేశ పెట్టిన ఈ సౌకర్యాన్ని అన్ని జిల్లాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

chitram...
ప్రగతి భవన్‌లో గురువారం వజ్ర, పల్లెవెలుగు, బయోడీజిల్‌తో నడిచే బస్సులను ప్రారంభించిన సిఎం