తెలంగాణ

అక్కరకు రాని మద్దతు.. కేంద్ర సాయంపై మిర్చి రైతు పెదవి విరుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికే అమ్ముడైన 85 శాతం పంట
మరో 15 శాతం పంటకోసమే మద్దతు
అదీ ఉత్తమ రకానికేననడంతో నిరాశ
ఇంకా అందని మార్గదర్శకాలు
ఎనుమాములలో ఎప్పటిలాగానే కొనుగోళ్లు

వరంగల్, మే 4: కేంద్రం ప్రకటించిన మద్దతు ధరపై మిర్చి రైతు పెదవి విరుస్తున్నాడు. మోదీ సర్కారు మీనమేషాలు లెక్కించి, సీజన్ ముగుస్తున్న దశలో ప్రకటించిన ఐదు వేల రూపాయల మద్దతు ధర ఏమాత్రం ప్రయోజనకరం కాదని రైతులు నిట్టూరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రైతును ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం కింద ఐదు వేల రూపాయల మద్దతు ధరను, ఇతరత్రా ఖర్చుల కింద 1250 రూపాయలను ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన ఎనుమాముల యార్డు కు ఇంకా తాజా ఆదేశాలు అందలేదు. దీంతో గురువారం మామూలుగానే అమ్మకాలు సాగిపోయాయి. అతి కొద్దిమంది మాత్రమే ఒకటి రెండు రోజుల్లో కేంద్రం మార్గదర్శకాలు వస్తాయనే ఉద్దేశంతో పంటను అమ్మకుండా నిల్వ చేసుకున్నారు. మార్కెట్లో తేజ, దేశీ మిర్చి రకాలకు ధర బాగానే ఉంది. ఎనుమాముల మార్కెట్లో గురువారం తేజ రకం క్వింటాల్‌కు 5,800 రూపాయలు, దేశీ రకం మ మిర్చి 6,900 రూపాయలు పలికింది. అలాంటప్పుడు కేంద్రం ఐదు వేల మద్దతు ధర ప్రకటించడం ఎలా సమంజసమని ఓ రైతు ప్రశ్నించాడు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరను ఓ రైతు వ్యాపార ప్రకటనతో సరిపోల్చాడు. ‘అతి తక్కువ ధరకే అమ్మకం’ అంటూ ప్రకటన ఇచ్చి, చిన్న అక్షరాల్లో ‘షరతులు వర్తిస్తాయి’ అంటూ వచ్చే వ్యాపార ప్రకటనలకూ, కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకూ తేడా ఏం లేదన్నాడు. డిసెంబర్ నుంచి కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఇప్పటికే 85 శాతం పంట అమ్ముడుపోయింది. కాగా ఈనెల 2నుంచి 31వ తేదీ వరకు జరిగే కొనుగోళ్లకు మాత్రమే మద్దతు ధర అమలవుతుందని కేంద్రం పేర్కొనడం రైతులకు కుంగదీస్తోంది. కేవలం మార్కెట్‌కు వచ్చే 15 శాతం పంటకే మద్దతు ధర అమలవుతుందన్నమాట. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఎనిమిది లక్షల క్వింటాళ్లకు పైగానే పంట అమ్ముడయింది. ధర పలక్క పంటను తెగనమ్ముకున్న ఈ రైతుల పరిస్థితి ఏమిటన్నది ప్రధాన ప్రశ్న. అదీకాక అత్యుత్తమ రకం మిర్చికే ఐదు వేల మద్దతు ధర అని తేల్చి చెప్పడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పైగా మూడు లక్షల 37వేల క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేస్తామన్నది కేంద్రం షరతు. ఎనుమాముల మార్కెట్‌కు గురువారం ఒక్క రోజే 15,800 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. ఈ లెక్కన మూడు లక్షల క్వింటాళ్ల మిర్చి కొనుగోలుకు కేవలం పది, పనె్నండు రోజులు పట్టవచ్చు. ఆ తరువాత వచ్చే వచ్చే మిర్చి పంటకు మద్దతు ధర వర్తించదన్నమాట. ఎకరాకు 80వేల నుంచి లక్ష రూపాయల వరకూ పెట్టుబడి పెట్టామని, సరకు రవాణాతో కలుపుకుంటే ఖర్చు తడిసిమోపెడవుతోందని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధరగా ఎనిమిది వేల రూపాయలు చెల్లించటంతోపాటు ఇతర ఖర్చుల కింద కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 2500 రూపాయలు చెల్లిస్తే కొంత ఊరట లభిస్తుందంటున్నారు. సీజన్ ప్రారంభం నుంచి జరిగిన కొనుగోళ్ల మొత్తానికి ఈ ధర వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తిపంటకు ప్రత్యామ్నాయంగా రైతులు మిర్చిపంట వేయగా క్వింటాలుకు అత్యధికంగా 12వేల వరకు ధర లభించింది. దాంతో ఈ ఏడాది కూడా రైతులు విస్తారంగా మిర్చిపంట వేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పంట విస్తీర్ణం 40 శాతం పెరిగింది. వర్షాలు కూడా బాగానే కురవడంతో పంట దిగుబడి ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా మార్కెట్‌కు పంట తీసుకువచ్చిన రైతులకు నిరాశే ఎదురయింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డు అధికారుల సమాచారం ప్రకారం గత సీజన్‌లో 5.15లక్షల క్వింటాళ్ల మిర్చి అమ్మకాలు జరుగగా, ఈ సీజన్‌లో ఇప్పటికే సుమారు 8.20 లక్షల క్వింటాళ్ల పంట కొనుగోళ్లు జరిగింది. డిసెంబర్ నెలలో ప్రారంభమైన మిర్చి కొనుగోళ్లు ఇప్పటికే 85శాతం పూర్తవగా, మరో 15 శాతం మిర్చి మాత్రమే అమ్మకానికి రావలసి ఉందని చెబుతున్నారు. ప్రారంభంలో ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ధర పలికినా ఆ తరువాత క్రమేపి ధర తగ్గుతూ వచ్చింది. నాణ్యమైన మిర్చికి మూడువేల రూపాయల ధర కూడా పలకటం లేదు. రైతులు ఆందోళన చేసిన ప్రతిసారీ ఒకటి రెండు రోజులు ధరలు పెరిగినట్టే పెరిగి మళ్లీ పడిపోవడం మామూలైపోయింది. ప్రారంభంలో నాఫెడ్ కొంత మేరకు మిర్చి కొనుగోలు చేసినా ఆ తరువాత చేతులు ఎత్తివేయటం కూడా సమస్య జటిలమవడానికి కారణమయింది.
chitram..
వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్ యార్డుకు
గురువారం తరలివచ్చిన మిర్చి బస్తాలు