తెలంగాణ

తెలుగు మురిసేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండుగలా ప్రపంచ మహాసభలు సాగాలి
దేశ విదేశాల్లోని సాహితీవేత్తలకు ఆహ్వానాలు
పగలు సభలు, రాత్రి కళా ప్రదర్శనలు
సన్నాహాలపై సిఎం కెసిఆర్ దిశా నిర్దేశం

హైదరాబాద్, మే 5: ప్రపంచ తెలుగు మహాసభలకు దేశ విదేశాల్లోని సాహితీవేత్తలను ఆహ్వానించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినాన ప్రపంచ తెలుగు మహాసభలకు అంకుర్పారణ జరిపి, తర్వాత పది పదిహేను రోజుల పాటు సభలు నిర్వహించాలని సూచించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం సిఎం అధ్యక్షతన ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సన్నాహక సమావేశంలో సభలను ఏవిధంగా నిర్వహించాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. సభలకు రాష్టవ్య్రాప్తంగా ఉన్న సాహితీ ప్రముఖులను, తెలుగు భాషా పండితులను ఆహ్వానించి, వారిని ఆన్ డ్యూటీగా పరిగణించి రవాణా ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి, సాహితీ వికాసానికి తెలంగాణకు చెందిన ఎందరో మహానుభావులు అమితంగా కృషి చేశారన్నారు. పోతన మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు అనేక రచనలు చేసినవారు ఉన్నారన్నారు. ఎన్నో సాహిత్య ప్రక్రియలను సుసంపన్నం చేసిన వారున్నారని, వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయ సాహిత్యం, అవధాన సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో తెలంగాణ వ్యక్తులు చేసిన కృషి తెలిసేలా సాహిత్య సభలు నిర్వహించాలని సూచించారు. సినీరంగం, పాత్రికేయ రంగం, కథా, నవలా, కవిత్వ రచనలు, హరికథ, బుర్రకథ, యక్షగానం, చందోబద్ధమైన ప్రక్రియలు తదితర అంశాల్లో తెలంగాణ సాహితీ మూర్తులు ప్రదర్శించిన ప్రతిభా పాటవాలు ప్రధానంశాలుగా మహాసభలు జరగాలన్నారు. పగటి పూట సభలు, సదస్సులు, రాత్రి వేళల్లో పేరిణి నృత్య ప్రదర్శనలతోపాటు కళారూపాలు ప్రదర్శించాలన్నారు. కవి సమ్మేళనాలు, సాహిత్య గోష్టులు, ఆవధానాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు వ్యాస రచన, వకృత్వ, కవితా రచన పోటీలు నిర్వహించలన్నారు. రాష్ట్రంలోని సాహితీవేత్తలతో పాటు తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పాటు ముంబై, సూరత్, బీవండి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, షోలాపూర్, ఒడిశా తదితర ప్రాంతాల్లోని సాహితీవేత్తలనూ ఆహ్వానించాలని సిఎం సూచించారు. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, గల్ఫ్ తదితర దేశాల్లో ఉన్న సాహితీవేత్తలనూ ఆహ్వానించాలని సూచించారు.

చిత్రం... ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కమిటీతో సమావేశమైన సిఎం కెసిఆర్