తెలంగాణ

ఆశ నెరవేరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెల్త్ వర్కర్లకు సిఎం కెసిఆర్ వరాలు నెల వేతనం రూ.6 వేలకు పెంపు
ఈనెల నుంచే కొత్త వేతనాలు అమలు త్వరలో మళ్లీ పెంచుతామని హామీ
ఎఎన్‌ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యత గ్రామాల్లో ఆరోగ్య సంరక్షకులవ్వండి
ప్రగతి భవన్‌లో సిఎం ముఖాముఖి ఎంపి కవిత కృషికి వర్కర్ల కృతజ్ఞతలు

హైదరాబాద్, మే 5: దశాబ్దకాలంగా చాలీ చాలని వేతనాలతో పని చేస్తున్న ఆశా వర్కర్ల ఆశలు ఎట్టకేలకు నెరవేరాయి. కేవలం వెయ్య, పదిహేను వందల వేతనంతో పని చేస్తున్న ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.6 వేలకు పెంచుతున్నట్టు సిఎం చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పెంచిన వేతనం మే నుంచే అమల్లోకి వస్తుందన్నారు. పెంచిన వేతనంతోనే సరిపెట్టకుండా భవిష్యత్‌లో మరోసారి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ ఎంపి కల్వకుంట కవిత చొరవతో రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో శుక్రవారం జనహితకు తరలివచ్చారు. అర్దాకలితో గ్రామీణ ప్రాంత పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల దీనస్థితిని సిఎం దృష్టికి ఎంపి కవిత తీసుకెళ్లారు. సిఎం వెంటనే స్పందించి వారిని తన క్యాంపు కార్యాలయానికి శుక్రవారం ఆహ్వానించి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. వారి సాధక బాధకాలను సిఎం ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు. ఆశా వర్కర్లకు వేతనాల పెంపు ఇది మొదటి దశ మాత్రమేనని, వచ్చే బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయించి వీరిని అంగన్‌వాడీ వర్కర్ల స్థాయికి తీసుకెళ్తామని హామీఇచ్చారు. విద్యార్హతలు ఉండి, శిక్షణ పొందిన వారికి ఎఎన్‌ఎం ఉద్యోగాల నియామకాల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఇతర కోర్స్‌లు అభ్యసించిన వారుంటే ఆరోగ్యశాఖలో భర్తీ చేసే పోస్టుల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఆశ వర్కర్లతో ఇంతకాలంగా వెట్టి చాకిరీ చేయించారని, ఇది మంచి పద్ధతికాదన్నారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేసి వారు గౌరవప్రదమైన జీవితం గడిపేలా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆరోగ్య సేవలు మాత్రమే కాకుండా ప్రభుత్వం నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో కూడా పనులు చేయిస్తున్నారన్నారు. ఆశా వర్కర్లకు జాబ్ చార్ట్ కూడా లేకపోవడంతో వారితో ఏ పనిబడితే ఆ పని చేయిస్తున్నారన్నారు. ఇక నుంచి ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో ఆరోగ్య పరిరక్షులుగా, సైనికులుగా పని చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఆశ వర్కర్లు ఏమి పని చేయాలో స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తమ వేతనాన్ని ఒకేసారి 1500 నుంచి ఉహించని విధంగా రూ.6 వేలకు పెంచడం పట్ల ఆశా వర్కర్లు సంతోషంతో హర్షధ్వనాలు చేయడంతో జనహిత మారోమోగిపోయింది. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసిన ఎంపి కవితకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

చిత్రం.. ప్రగతి భవన్‌లో ఆశా వర్కర్లతో ముఖాముఖి మాట్లాడుతున్న సిఎం కెసిఆర్