తెలంగాణ

విద్యుత్ శాఖలో 13,357 పోస్టుల భర్తీకి జీవో జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి మిగులు విద్యుత్ రాష్ట్రం స్థాయిని అందుకోడానికి తెలంగాణ చర్యలు ఆరంభించింది. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీతో ఎక్కువ ఉత్పాదన సాధించే యోచనతో అడుగులేస్తోంది. వారం క్రితం విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపిన సర్కారు, తాజాగా శనివారం తెలంగాణ విద్యుత్ శాఖలో 13,357 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ట్రాన్స్‌కోలో 3441, జెన్‌కోలో 4329, ఎస్‌పిడిసిఎల్‌లో 2336, ఎన్‌పిడిసిఎల్‌లో 3251 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతించింది. విద్యుత్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఎనర్జీ డిపార్టుమెంట్ చేసిన పోస్టుల భర్తీ ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.