తెలంగాణ

చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రారంభమైన వాణిజ్య సరఫరా
700 మెగావాట్ల విద్యుత్‌ను పొందుతున్న తెలంగాణ
రబీ ముగియడంతో తగ్గిన విద్యుత్ డిమాండ్
వచ్చే నెల తిరిగి పెరిగే అవకాశం

హైదరాబాద్, మే 7: చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వాణిజ్య పరంగా విద్యుత్ కారిడార్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సరఫరా ప్రారంభమైంది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత కష్టాలు తీరడమే కాకుండా, రైతులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలవుతుంది. శనివారం అర్ధ రాత్రి నుంచి వార్ధా డిచ్‌పల్లి 765 కెవి డబుల్ సర్క్యూట్ ట్రాన్స్‌మిషన్ లైన్ ద్వారా చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ సరఫరా అవుతున్నట్లు తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు చెప్పారు. ఈ సర్క్యూట్ ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు అనుసంధానమైనట్లు చెప్పారు. పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఈ సర్క్యూట్‌ను నిర్మించిందన్నారు. ప్రయోగాత్మకంగా మార్చి నెలలో చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ వచ్చిందన్నారు. మార్చి30వ తేదీ నుంచి 21 రోజుల పాటు కారిడార్ లోడును పరీక్షించేందుకు విద్యుత్‌ను సరఫరా చేసినట్లు చెప్పారు. కాగా ఏప్రిల్ 8వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య గాలుల వల్ల మహారాష్టత్రో పాటు రాష్ట్రంలో టవర్లు దెబ్బతిన్నాయి. దీని వల్ల రెండు వారాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఖరారైన విషయం విదితమే. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను వచ్చే పదేళ్ల పాటు చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి తెలంగాణ కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందానికి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. కాని రేటు గురించి అవసరమైన చర్చలుచేయాలని కోరింది. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు రేటు యూనిట్‌కు రూ.3.90పైసలు ఉంది.
చత్తీస్‌గఢ్‌లో జంజీర్ చంపా జిల్లాలో నిర్మించిన మార్వా థర్మల్ ప్లాంట్ నుంచి ఈ విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో ఎన్టీపిసితో పాటు స్వల్పకాలిక ఒప్పందాలపై విద్యుత్ కొనుగోలు చేస్తున్న సంస్థల నుంచి విద్యుత్‌ను తాత్కాలికంగా తీసుకోకూడదని రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. మార్వాలో 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్న రెండు ప్లాంట్లను బిహెచ్‌ఇఎల్ తక్కువ సమయంలో నిర్మించింది. ఈ రెండు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైనా, కారిడార్ లేనందు వల్ల తెలంగాణకు విద్యుత్ రావడంలో ఆలస్యమైంది.
చత్తీస్‌గఢ్ విద్యుత్ సంస్థలు, నియంత్రణ మండలితో తుది చర్చలు జరిపిన తర్వాత విద్యుత్ కొనుగోలు రేటును ఖరారు చేసేందుకు తెలంగాణ డిస్కంలు సిద్ధమవుతున్నాయి. చత్తీస్‌గఢ్‌తో తెలంగాణ ప్రభుత్వం 2014 నవంబర్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. రెండు విద్యుత్ సంస్ధల మధ్య కొనుగోలు ఒప్పందం 2015 సెప్టెంబర్‌లో ఖరారైంది.
కాగా రాష్ట్రంలో రబీ సీజన్ ముగియడంతో విద్యుత్ డిమాండ్ తగ్గింది. రబీ సీజన్‌లో అంటే ఏప్రిల్ మొదటి వారం వరకు రోజుకు 195 ఎంయు అంటే 9200 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. కాగా రబీ సీజన్ ముగియడంతో ఇప్పుడు 145 నుంచి 150 ఎంయు డిమాండ్ మాత్రమే ఉంటోంది. వేసవి కాలమైనా విద్యుత్‌కు కొరతలేకుండా డిస్కంలు సరఫరా చేస్తున్నాయి. వచ్చే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వెంటనే విద్యుత్ డిమాండ్ రోజుకు 195 ఎంయుకు చేరుకునే అవకాశం ఉందని విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి.