తెలంగాణ

ప్రశ్నపత్రం తారుమారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీట్ పరీక్షలో గందరగోళం

తెలుగుమీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రశ్నపత్రం
వరంగల్‌లో విద్యార్థుల ధర్నా
సిబిఎస్‌ఇకి పరీక్షా కేంద్రం నిర్వాహకుల సమాచారం
రెండురోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్న అధికారులు

వరంగల్, మే 7: వరంగల్ నగరంలో ఆదివారం జరిగిన నీట్ పరీక్ష సందర్భంగా సెయింట్ పీటర్స్ హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో తెలుగుమీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీల ఉన్న ప్రశ్నాపత్రాన్ని ఇవ్వటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రశ్నపత్రం మార్పిడిపై నిరసన వ్యక్తం చేస్తూ పరీక్ష అనంతరం పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు పరీక్షాకేంద్రానికి వెళ్లి నీట్ పరీక్షలో ఇబ్బందికి గురైన విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష కోసం వరంగల్ నగరంలో 8078 మంది విద్యార్థుల కోసం 16పరీక్ష కేంద్రా లు ఏర్పాటు చేసారు. నగరంలోని వడ్డేపల్లి రోడ్డు ఎన్టీఓస్ కాలనీ ప్రాంతంలో ఉన్న సెయింట్ పీటర్స్ స్కూల్‌లో 850 మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 144 మంది తెలుగు మీడియంలో పరీక్ష రాయవలసి ఉంది. కానీ, ఇన్విజిలేటర్లు ఇంగ్లీష్, హిందీలో ఉన్న పరీక్షా పత్రాన్ని విద్యార్థులకు అందజేసారు. బుక్‌లెట్‌పై అప్పటికే తమ హాల్‌టికెట్ నెంబరు రాసిన విద్యార్థులు తెలుగుకు బదులు ఇంగ్లీష్‌లో ఉన్న ప్రశ్నాపత్రం అందటంతో అయోమయానికి గురయ్యారు. సమయం కూడా ఉదయం 10.15 గంటలు కావటంతో యేమీ చేయలేని పరిస్థితి నెలకొంది. తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసేందుకు అవకాశం ఉన్నప్పటికీ తెలుగు ప్రశ్నపత్రమే పరీక్షా కేంద్రానికి చేరలేదు. దీంతో సమస్య పరిష్కారం కోసం పరీక్ష కేంద్రం కో-ఆర్డినేటర్ విషయాన్ని ఢిల్లీలోని సిబిఎస్‌ఇ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికిపుడే సమస్యను పరిష్కరించలేమని, ప్రశ్నాపత్రం తారుమారుతో ఇబ్బందులకు గురైన విద్యార్థుల హాల్‌టికెట్ నెంబర్లు తీసుకోవాలని, రెండురోజుల్లో ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని సిబిఎస్‌ఇ ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చారు. పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు జరిగిన గందరగోళాన్ని అక్కడే ఉన్న తమ తల్లిదండ్రులకు చెబుతు కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పరీక్షా కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. వేలరూపాయలు ఖర్చుచేసి తమ పిల్లలకు కోచింగ్ ఇప్పించామరి, కానీ ఎవరి నిర్లక్ష్యం కారణంగానో తమ పిల్లల భవిష్యత్తు నాశనమయిందని ఆరోపిస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు కూడా భోరున విలపించటం కనిపించింది. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పరీక్షా కేంద్రం వద్ద బైఠాయించారు. విషయం తెలిసి వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు అక్కడకు చేరుకుని ఆందోళనలో భాగం పంచుకున్నారు. ప్రశ్నాపత్రం విషయంలో ఏర్పడిన గందరగోళం, విద్యార్థుల ఆందోళన విషయం తెలిసి వరంగల్ అర్బన్ ఆర్డీఓ వెంకారెడ్డి, ఏసిపి మురళీధర్, పలువురు సిఐలు హుటాహుటిన పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లి పరీక్షా నిర్వహకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సిబిఎస్‌ఇ అధికారులు తెలిపిన సమాచారాన్ని పరీక్షా కేంద్రం నిర్వాహకులు ఆర్డీఓకు, పోలీసు అధికారులకు వివరించగా విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి నచ్చజెప్పి ఆందోళన విరమింపచేసారు. కాగా పరీక్షా కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా తమ పిల్లల భవిష్యత్తు గందరగోళంలో పడిందని ఆరోపిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేయటంతో స్థానిక సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసారు.

చిత్రం... వరంగల్‌లో ఓ పరీక్షా కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు