తెలంగాణ

అన్ని గురుకులాల్లో ఒకే మెనూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, విద్యాశాఖ గురుకులాలు అన్నింటిలోనూ విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుండి ఒకే రకమైన భోజనం, వసతులు అందించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే భోజనానికి సంబంధించి మెనూ రూపొందించి అన్ని శాఖలకూ పంపించాలని అన్నారు. ప్రతి రెవిన్యూ డివిజన్‌కు ఒక మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గిరిజన మహిళా రెసిడెన్షియల్ కాలేజీలను రానున్న విద్యా సంవత్సరం నుండి ప్రారంభించాలని అన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు వసతుల కల్పన, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రులు జగదీశ్‌రెడ్డి, చందూలాల్, జోగు రామన్న, స్పెషల్ సిఎస్‌లు అజయ్‌మిశ్రా, రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యాశాఖ అధికారులు సచివాలయంలో సమావేశమయ్యిరు. హాస్టల్ వసతితో కూడిన డిగ్రీ కాలేజీలను మహిళలకు ఎక్కువగా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతి రెవిన్యూ డివిజన్‌కు ఒక మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఉండే విధంగా ప్లాన్ చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిగ్రీ కాలేజీల్లో విద్యార్థినులకు జాబ్ ఓరియెంటెడ్, వృత్తివిద్యలో నైపుణ్యం కల్పించే విధంగా కోర్సులను ప్రారంభించాలని అన్నారు. ఈ మేరకు ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్‌మిశ్రా ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 15 రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను ఇవ్వాలని అన్నారు. నివేదికలో వ్యవసాయ సంబంధిత, నర్సింగ్, వెటర్నరీ, ఐటి రంగాల్లో ఎలాంటి ఉపాధి కోర్సులు ఉన్నాయో అధ్యయనం చేసి వాటిని ఇవ్వాలని సూచించారు.
ఈ ప్రత్యేకమైన కోర్సులను కొత్తగా వచ్చే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలా? లేక వీటికోసమే ప్రత్యేకంగా కాలేజీలు పెట్టాలా? అనే దానిపై నివేదిక ఇవ్వాలని అన్నారు. అన్ని సొసైటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒకే అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించి దానిని అమలులోకి తీసుకురావాలని అన్నారు. విద్యార్థులకు గురుకులాల్లో ఇచ్చే వసతుల్లో కూడా ఎలాంటి తేడా ఉండరాదని అన్నారు. అన్ని పోటీ పరీక్షలకు గురుకులాల్లో కోచింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, స్టడీ సర్కిళ్లు అన్నింటినీ ఒక ఐఎఎస్ అధికారి కిందకు తీసుకురావాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే వివిధ సంస్థల్లో ఉన్న సౌకర్యాలపై కూడా సమీక్ష జరిగింది.

సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం