తెలంగాణ

మరో జలసాధన పోరుకు కాంగ్రెస్ సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 9: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని వివిధ మండలాల్లో మరో జలసాధన పోరుకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టబోతోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలకు కృష్ణాజలాలను అందించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత వంశీకృష్ణ సారథ్యంలో జలసాధన పోరుకు ఏర్పాట్లు చేసుకున్నారు. జలసాధన పోరుయాత్ర బుధవారం ప్రారంభం కానుంది. వంగూర్, చారకొండ మండలాలతో పాటు అచ్చంపేట పరిసర ప్రాంతాల రైతులకు కృష్ణాజలాలను అందించాలనే డిమాండ్‌తో ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు డిండి ఎత్తిపోతల ద్వారా వంగూర్, చారకొండ మండలాలకు సాగునీరు అందించాలనే ప్రధాన డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ జలసాధన పోరుకు శ్రీకారం చుట్టబోతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలనే డిమాండ్‌తో గతంలోనే జలసాధన పోరుయాత్రలు కొనసాగాయి. అందులో భాగంగానే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే ఎక్కడైతే సాగునీరు అందించాలని గతంలో జలసాధన ఉద్యమాలు ప్రారంభం అయ్యాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికి సాగునీరు రాలేకపోయింది. అయితే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా మూడు లిఫ్ట్‌లు ప్రారంభం అయినప్పటికిని కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీరు అందడం లేదు. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అంకురార్పణ చేసిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన కృష్ణాజలాలను డిండి ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాకు తీసుకెళ్తున్నారు. నల్గొండ జిల్లాకు తీసుకెళ్లే ముందు తమకు కృష్ణాజలాలను అందించాలని అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గ రైతాంగం కోరుతున్నారు. అయితే రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ జలసాధన పోరు ఉద్యమం పేరిట ముందుండి రైతులతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుడుతోంది.