తెలంగాణ

హైవేలపై బ్లాక్ స్పాట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రమాద ఘటనలో నిషిత్, రాజారవివర్మ దుర్మరణం ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు తరచుగా జరిగే 324 బ్లాక్ స్పాట్స్‌ను సరిదిద్దాలని ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై మొత్తం 324 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. రోడ్డు మలుపు తిరిగి ఉండడం, రోడ్డు వెడల్పు లేకపోవడం, రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉండటాన్ని రోడ్ సేఫ్టీ అథారిటీ గుర్తించింది. ఇందులో 67 ప్రమాకదరమైన స్పాట్లు ఉన్నాయి. ఈ రోడ్ స్పాట్స్‌ను సరిదిద్ది ప్రమాదాలను నివారించే బాధ్యతను రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు. రెవెన్యూ శాఖతో కలిసి భూమిని సేకరించి రోడ్లను వెడల్పు చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ పి రవీందర్ రావు చెప్పారు. రాష్ట్రంలో 2015లో 17999 రోడ్డు ప్రమాద సంఘటనల్లో 5725 మంది మరణించగా, 2016లో 19395 ఘటనల్లో 5563 మంది మృతి చెందారు. రాష్ట్రంలో రోడ్ల పొడవు 26,837 కి.మీ ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్‌ను జియోగ్రాఫిక్ ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్‌లో మ్యాప్ చేసినట్లు రోడ్ సేఫ్టీ అథారిటీ డైరెక్టర్ జనరల్ కృష్ణ ప్రసాద్ చెప్పారు. 324 బ్లాక్ స్పాట్స్ వద్ద ఉన్న ఆసుపత్రుల వివరాలు కూడా జిఐఎస్‌లో పొందుపరిచారు. ఈ స్పాట్స్‌పై సమీపంలోని గ్రామాల ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యతను స్థానిక పోలీసులు, రవాణా శాఖ, రెవెన్యూ శాఖ, రోడ్లు, భవనాల శాఖ, జాతీయ రహదారుల అథారిటీ, వైద్య ఆరోగ్య శాఖ, ఎక్సైజ్ శాఖ, స్వచ్చంద సేవా సంస్థలకు అప్పగించనున్నారు. రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 10 శాతం ప్రమాదాలు 324 స్పాట్స్ వద్దనే జరుగుతున్నాయి. మొత్తం మృతుల్లో15 శాతం మంది ఈ స్పాట్స్ వద్దనే మరణిస్తున్నారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో గణాంక వివరాలను విశే్లషిస్తే హైదరాబాద్‌లో 2010 నుంచి 2014 వరకు వివిధ రోడ్డు ప్రమాదాల్లో 2447 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాల్లోల 20-30 సంవత్సరాల మధ్య ఉన్న యువకులు ఎక్కువ మంది మరణిస్తున్నారు. హైదరాబాద్‌లో సగటున రోజు ఎనిమిది రోడ్డు ప్రమాదాలు జరిగితే, ఇద్దరు మరణిస్తున్నారు.