తెలంగాణ

వివిధ సంస్థలకు 163 ఎకరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ఆదిలాబాద్ జిల్లా యాపలగూడ గ్రామ శివారులో ఇండియన్ రిజర్వు పోలీస్ బెటాలియన్ ఏర్పాటు కోసం 111.37 ఎకరాలు కేటాయిస్తూ రెవిన్యూశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఉచితంగానే కేటాయించినట్టు పేర్కొన్నారు. ఆదిలాబాద్ మండలం బట్టిస్వరగాన్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం, సిబ్బంది వసతి గృహాల నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయిస్తూ రెవిన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రీయ విద్యాలయాలు నెలకొల్పడానికి ఉచితంగా స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఉచితంగా కేటాయించినట్టు రెవిన్యూశాఖ పేర్కొంది. సూర్యాపేట జిల్లా ఇమాంపేట గ్రామంలో సబ్ జైలు నిర్మాణానికి 4.02 ఎకరాలు కేటాయించింది. దీనిని కూడా ఉచితంగానే కేటాయించినట్టు రెవిన్యూశాఖ పేర్కొంది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 38.34 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ 765/400 కెవి సబ్ స్టేషన్‌ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు రూ. 8 లక్షల చొప్పున కేటాయించినట్టు రెవిన్యూశాఖ పేర్కొంది. రంగారెడ్డి జిల్లా గోల్కొండ మండలం షేక్‌పేట గ్రామంలో బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు 7.35 ఎకరాలు లీజుకు ఇచ్చినట్టు పేర్కొన్నారు. భూ కేటాయింపునకు ప్రతిఫలంగా ఆరోగ్యశ్రీ, ఎంప్లారుూస్ ఆరోగ్య పథకం (ఇహెచ్‌ఎస్) కింద బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేరే రోగులకు బిల్లుపై 25 శాతం డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుందన్న నిబంధనతో ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చినట్టు రెవిన్యూశాఖ పేర్కొంది.