తెలంగాణ

మా సమస్యలు పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. తమ సమస్యల జాబితాతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి హామీ ఇస్తూ సమస్యల పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నరసయ్య, ఈ.నవనీతరావు తెలిపారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు వేతన సంఘం సిఫార్సులను అనుసరించి 15 శాతం క్వాంటమ్ పెన్షన్ చెల్లించాలని, వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాల్లో పని చేసి పెన్షనర్లుగా ఉన్న వారికి ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని, పెన్షనర్లు 2.51 లక్షల మందికి ఇనె్సంటివ్ చెల్లించాలని, అర్హులైన పెన్షనర్లకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని, బస్సుల్లో రాయితీతో కూడిన ప్రయాణానికి వయో వృద్ధులను అనుమతించాలని డిమాండ్ చేశారు.