తెలంగాణ

దీక్షకు అనుమతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ఖమ్మం పట్టణంలో రైతుల సమస్యలపై రెండు రోజుల పాటు దీక్ష చేపట్టేందుకు అనుమతివ్వాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి డిజిపి అనురాగ్ శర్మను కోరారు. ఈ మేరకు ఆయన ఒక వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ తరఫున రెండు రోజుల దీక్ష చేపడుతున్నామని, ఇందుకు అనుమతించాలని ఖమ్మం పోలీసు కమిషనర్‌కు ఇప్పటికే దరఖాస్తు చేశామని తెలిపారు. కానీ ఇంతవరకు అనుమతి విషయమై తేల్చ లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకుని అనుమతి ఇవ్వాలని ఆయన డిజిపిని కోరారు. కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ఈ దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. మిర్చి రైతుల సమస్యతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఈ దీక్ష టిడిపి చేపడుతోందని తెలిపారు.
హక్కులడిగితే వేధిస్తున్న ప్రభుత్వం
ప్రభుత్వ వైఫల్యాలు, తమకు దక్కాల్సిన న్యాయమైన హక్కులపై ప్రభుత్వాన్ని నిలదీసిన వారిని వేధించడమే లక్ష్యంగా కెసిఆర్ సర్కార్ పని చేస్తోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. హోంగార్డుల సమస్యలపై పోరాటం చేస్తున్న హోంగార్డుల అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల నారాయణను ప్రభుత్వం విధుల నుంచి తొలగించి జీతం చెల్లించకుండా వేధింపులకు గురి చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రశ్నిస్తే అణచివేసే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. వెంటనే నారాయణను విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఏడు నెలల జీతాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.