తెలంగాణ

ఉద్యాన పంటలపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ఉద్యాన పంటలపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనే విధంగా పరిశోధనలు జరగాలని తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి సూచించారు. ఈనెల మూడో వారంలో జరగనున్న జోనల్ స్థాయి పరిశోధన, విస్తరణ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశం అజెండాపై చర్చించేందుకు బుధవారం ప్రత్యేక సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, సేంద్రీయ విధానంలో పళ్లతోటల పెంపకాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ కోణంలో శాస్తవ్రేత్తలు పరిశోధన చేయాలన్నారు. మామిడి, జామ, మోసంబి, పసుపు, మిరప, టమాట, వంకాయ, బెండ తదితర పంటలు వేస్తున్న రైతులు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారని, ఈ సమస్యలను పరిష్కరించే విధంగా పరిశోధన జరిగితే రైతులకు మేలు జరుగుతుందన్నారు. సేంద్రీయ వ్యవసాయంపై అన్ని ప్రభుత్వ పరిశోధనా కేంద్రాల్లో పరిశోధన జరగాలన్నారు. ద్రవ ఎరువుల వినియోగం (్ఫర్టిగేషన్)పై పంటల వారీగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ఉద్యాన యూనివర్సిటీలో ఖాళీపోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చినందువల్ల, రెండునెలల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. బోధన, పరిశోధన, విస్తరణలపై సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని పార్థసారథి సూచించారు. సూక్ష్మసేద్యం (మైక్రోఇరిగేషన్), పాలీహౌజ్ విధానంలో సేద్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందువల్ల ఈ అంశాల్లో సాంకేతికంగా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటవెంటనే పరిష్కరించాలన్నారు. రైతుల అవగాహనకు ప్రచారం చేయాలని, కరపత్రాలు, బ్రోచర్ల ద్వారా రైతులకు వివరాలు అందించాలని కోరారు. ఉద్యాన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖాళీపోస్టుల భర్తీకి చొరవ చూపిన వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథిని ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు సన్మానించారు. ఈ సమావేశంలో ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె.రవీందర్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం.విజయ, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ డాక్టర్ రావి చంద్రశేఖర్, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ కె.వనజాలత, డీన్ ఆఫ్ పిజి స్టడీస్ డాక్టర్ ఎం.పద్మతో పాటు వివిధ విభాగాలకు చెందిన శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు.