తెలంగాణ

కేంద్రం సహకరిస్తున్నా స్వీకరించడానికి సిద్ధంగా లేని రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: కేంద్రప్రభుత్వం సహకరిస్తున్నా ఆ సహకారాన్ని స్వీకరించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా లేదని బిజెపి శాసనసభాపక్ష నాయుకుడు జి కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ఆర్థిక మద్దతుతో ముందుకు వచ్చినా, మిర్చి రైతుల నుండి సకాలంలో మిర్చి కొనుగోలులో విఫలమైందని, ఫలితంగా మిర్చి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా బరితెగింపునకు దిగుతోందని, జిల్లాల్లో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొందరు అధికారులు బిజెపి ప్రజాప్రతినిధులను పరోక్షంగా బెదిరిస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నారాయణ్‌పేట మున్సిపల్ చైర్‌పర్సన్ అనసూయ పట్ల అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, నిధులను విడుదల చేయకుండా జిల్లా కలెక్టర్ వేధింపులకు పాల్పతున్నారని ఆరోపించారు.
అమిత్‌షా పర్యటన ఖరారు
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన షెడ్యూలు దాదాపు ఖరారైంది. పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, క్షేత్ర స్థాయి పార్టీ పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై షా సమీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 22,23,24 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. షా మూడు రోజుల పర్యటన కోసం నల్లగొండ, నిజామాబాద్‌లలో ఒక జిల్లాను రాష్ట్ర బిజెపి ఎంపిక చేసినట్టు సమాచారం. మహబూబ్‌నగర్, భువనగిరి జిల్లాల్లో పర్యటన విషయమై ప్రాథమికంగా పరిశీలించారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ప్రాంతం, రజాకర్లు అరాజకాలకు పాల్పడిన ప్రాంతం, నక్సల్స్ చేతిలో బిజెపి నాయకులు హతులైన ప్రాంతాల్లో పర్యటన ఉండేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. చివరి రోజు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో షా పాల్గొంటారు. అదే రోజు రాత్రి విజయవాడకు బయలుదేరి వెళతారు.