తెలంగాణ

పెనుగాలులు, భారీ వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబాబాద్, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్ (మల్కాజిగిరి) తదితర జిల్లాల్లో మంగళవారం అర్ధ రాత్రి పెనుగాలులు, భారీ వర్షం తీవ్రమైన బీభత్సాన్ని సృష్టించాయి. మంగళవారం రాత్రి సుమారు 11 గంటలకు హఠాత్తుగా ప్రారంభమైన ఈదురు గాలులు, భారీ వర్షం సుమారు రెండు గంటల పాటు కొనసాగాయి. గంటకు 120 నుండి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజధానిలో చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం తదితర ఘటనలపై మున్సిపల్ మంత్రి కెటిఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎప్పటికప్పుడు సమీక్షించారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జిల్లాల్లో పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లడంతో పాటు, రోడ్లపై చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం కలిగింది. చాలా ప్రాంతాల్లో మామిడి పంటకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. నిమ్మ, దానిమ్మ తదితర పళ్ల తోటలతో పాటు, వరి, మొక్కజొన్న తదితర పంటలకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లింది. చాలా ప్రాంతాల్లో రైతులు మార్కెట్లకు తెచ్చిన ధాన్యం భారీగా తడిసిపోయింది. మంగళవారం మార్కెట్లకు వచ్చిన వరిధాన్యం తూకం కాకపోవడంతో చాలా మంది రైతులు ఆరుబయటే తమ ధాన్యాన్ని కుప్పలుగా పోయడం, లేదా బస్తాల్లో నిలువచేయడంతో అది తడిసిపోయింది. సూర్యాపేట పాతమార్కెట్, వలిగొండ, మహబూబాబాద్, జడ్చర్ల, వికారాబాద్ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో వరిధాన్యం తడిసిపోయింది. వేలాది టన్నుల ధాన్యం పాడయినట్టు ప్రాథమికంగా అందిన సమాచారం వల్ల తెలిసింది. జిల్లాల్లో నష్టాలపై తక్షణమే పరిశీలించి తనకు నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వర్షం, గాలులకు గురైన జిల్లాల్లో కలెక్టర్లు బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయం, ఉద్యాన, విద్యుత్ తదితర శాఖలకు చెందిన అధికారులతో జరిగిన నష్టంపై చర్చించారు. వివిధ రూపాల్లో జరిగిన నష్టంపై గురువారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.
రాజధానిలో..
హైదరాబాద్‌లో భారీ వర్షం, పెనుగాలులకు 291 చెట్లు కూలిపోయాయని, 32 కరెంట్ స్తంభాలు పడిపోయాయని అధికార వర్గాలు వెల్లడించాయి. జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్ రెడ్డి బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో చర్చించారు. ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపి రోడ్లను క్లియర్ చేశామని కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ప్రకటించారు.

చిత్రాలు.. బుధవారం రాత్రి వీచిన పెనుగాలులతో హైదరాబాద్‌లో విరిగిపడిన చెట్లు
భారీ వర్షంతో హైదరాబాద్‌లో రోడ్లపై నిలిచిన నీరు